చీరకట్టు సోయగాలతో మంత్రముగ్ధుల్ని చేస్తున్న కుషిత కల్లపు!

ఈ మధ్యకాలంలో చిట్టి పొట్టి బట్టలతో ఆకట్టుకునే అవసరం లేకుండానే సాంప్రదాయంగా ఒంటినిండా దుస్తులు ధరిస్తూ అందాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు కొంతమంది హీరోయిన్స్ .;

Update: 2026-04-10 06:35 GMT

ఈ మధ్యకాలంలో చిట్టి పొట్టి బట్టలతో ఆకట్టుకునే అవసరం లేకుండానే సాంప్రదాయంగా ఒంటినిండా దుస్తులు ధరిస్తూ అందాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు కొంతమంది హీరోయిన్స్ . ముఖ్యంగా రుక్మిణి వసంత్, అనుపమ పరమేశ్వరన్, రెజీనా కాసాండ్రా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది హీరోయిన్లు చీర కట్టులో కనిపించే అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి కుషిత కల్లపు కూడా వచ్చి చేరింది. తాజాగా మరొకసారి సోషల్ మీడియాలో అభిమానుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ




 


తాజా ఇంస్టాగ్రామ్ పోస్టు ఈమెకు పెరుగుతున్న ప్రజాదారణకు నిదర్శనం అనడంలో సందేహం లేదు. తాజాగా చీర కట్టులో అందాలను ఆరబోస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లైట్ స్కై బ్లూ కలర్ చీర కట్టి మెరూన్ రెడ్ బ్లౌజ్ ధరించి నడుమును సన్నని గొలుసుతో ఫుల్ ఫిల్ చేస్తూ వెనుక నుంచి స్మైల్ ఇస్తూ షేర్ చేసిన ఫోటోలు అభిమానుల హృదయాలను ఒక్కసారిగా కొల్లగొట్టాయి. నీటి కొలను దగ్గర నిలబడి బ్యాక్ అందాలు చూపిస్తూ కుషిత షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ఈ ముద్దుగుమ్మను ఇలా చూసేసరికి అభిమానులు కొత్త నేషనల్ క్రష్ అంటూ పిలుస్తున్నారు.




 


ఇప్పటికే పలువురు భామలను బీట్ చేసి తన అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది కుషిత. ముఖ్యంగా ఈమె స్మైల్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు అనడంలో సందేహం లేదు.ఇక కుషిత తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఇప్పటికే 11.2 లక్షల మంది ఫాలోవర్లతో బలమైన అభిమానాన్ని సొంతం చేసుకుంది . అటు సోషల్ మీడియాతో పాటు ఇటు తన నటన కెరియర్ లో కూడా రాణిస్తోంది . అందులో భాగంగానే ఇటీవల ఆహాలో ప్రసారమైన 3 రోజెస్ సీజన్ 2 లో కనిపించిన ఈమె అక్కడ తన అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. నీతోనే నేను, చాంగురే బంగారు రాజా వంటి చిత్రాలలో కూడా నటించింది.




 


2002 అక్టోబర్ 19న తెలంగాణ హైదరాబాదులో జన్మించిన ఈమె ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా తన కెరియర్ను మొదలు పెట్టింది . ఇక ఆ తర్వాత నటిగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. 2023లో నీతోనే నేను అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత చాంగురే బంగారు రాజా సినిమాతో మరింత దగ్గరైన ఈమె గత ఏడాది ఇండియన్ పీనల్ లా లో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం ఇప్పుడు సరైన అవకాశాల కోసం పాటుపడుతున్న ఈమె ఇలా సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తోంది.

Tags:    

Similar News