బాలు బాలీవుడ్ ఎంట్రీ...కిశోర్ కుమార్ కి గట్టి పోటీ
తెలుగులో గాన గంధర్వుడి గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి పేరు. ఆయన తెలుగులో 1966లో నేపధ్య గాయకుడిగా ఎంట్రీ ఇస్తే ఆ మరుసటి ఏడాది తమిళంలో పాటలు పాడడం మొదలెట్టారు.e;
తెలుగులో గాన గంధర్వుడి గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి పేరు. ఆయన తెలుగులో 1966లో నేపధ్య గాయకుడిగా ఎంట్రీ ఇస్తే ఆ మరుసటి ఏడాది తమిళంలో పాటలు పాడడం మొదలెట్టారు. అలా కన్నడం, మళయాళం భాషాలలో కేవలం అయిదేళ్ల వ్యవధిలోనే పాడుతూ అందరి ఫేవరెట్ సింగర్ గా ముద్ర వేసుకున్నారు. ఇక మిగిలిన ప్రాంతీయ భాషలలో బాలూ తన గొంతుని వినిపించి జెండా పాతినా కూడా బాలీవుడ్ లో ఆయన సినీ ప్రవేశం మాత్రం చాలా ఆలస్యంగానే జరిగింది అని చెప్పాలి. 1980లో ఏక్ దూజే కేలియే మూవీ ద్వారా బాలూ బాలీవుడ్ లో ప్లే బ్యాక్ సింగర్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మొత్తం పాటలను అందులో బాలూ పాడడం లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ తో కలిసి చేసిన మ్యూజిక్ మ్యాజిక్ కి బాలీవుడ్ ఉర్రూతలూగింది.
బాలచందర్ పట్టుబట్టి :
ఇక బాలు హిందీ పాటలను పాడడం విచిత్రంగా జరింది. 1980 నాటికి బాలు దక్షిణాదిన తిరుగులేని గాయకుడిగా ఉన్నారు. రోజుకు పదిహేను పాటలు దాకా వివిధ భాషలలో పాడే బిజీ సింగర్ ఆయన. ఆ సమయంలో బొంబాయి వెళ్ళి పాటలు పాడడం అంటే కష్టతరం అయ్యేది. దాంతో బాలు ఎందుకొచ్చిన బాలీవుడ్ అన్న ఆలోచనలో ఉండేవారు. అయితే ఏక్ దూజే కేలియే సినిమా దర్శకుడు తమిళనాడుకు చెందిన సౌత్ దిగ్గజం కె బాల చందర్. ఆయన తెలుగు తమిళ భాషలలో ఒకేసారి తెరకెక్కించిన మరో చరిత్ర 1979లో రిలీజ్ అయి రెండు భాషలలోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. కమల్ హాసన్ కి ఓవర్ నైట్ స్టార్ డం ని తీసుకుని వచ్చింది.
యూనివర్శల్ సబ్జెక్ట్ :
ఇక మరో చరిత్ర విషాద ప్రేమ కధ. యూనివర్సల్ సబ్జెక్ట్. దాంతో హిందీలో ఈ మూవీని తీయాలని బాలచందర్ నిర్ణయించుకుని హీరోగా కమల్ హాసన్ ని తీసుకున్నారు. రతీ అగ్నిహోత్రి ని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. తెలుగులో అద్భుతమైన మ్యూజిక్ ఎమ్మెస్ విశ్వనాథన్ మరో చరిత్రకు ఇచ్చారు. అందుకే క్లాసికల్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా పేరున్న లక్ష్మీ కాంత్ ప్యారేలాల్ లను ఆయన ఏక్ దూజే కేలియేకి తీసుకున్నారు. ఇక పాటలు ఎవరి చేత పాడించాలి అన్న దగ్గర లక్ష్మీ కాంత్ ప్యారేలాల్ కి బాలచందర్ కి మధ్య చర్చ సాగింది అని చెబుతారు. హిందీలో టాప్ సింగర్ గా నాడు కొనసాగుతున్న కిశోర్ కుమార్ చేతనే మొత్తం పాటలు పాడించాలని లక్ష్మీ కాంత్ ప్యారేలాల్ ద్వయం గట్టిగా పట్టుబట్టారు. అయితే బాల చందర్ మాత్రం ఎస్పీబీ చేతనే పాడించాలని డైరెక్టర్ గా తన మాట బలంగా చెప్పారు. దానికి ఆయన చెప్పిన ఒకే ఒక కారణానికి ఆ బాలీవుడ్ సంగీత ద్వయం అంగీకరించారు. సినిమాలో హీరో క్యారెక్టర్ తమిళనాడు నేపధ్యంతో కూడుకున్నదని అందుకే సౌత్ సింగర్ బాలు పాడితేనే బెస్ట్ అవుట్ పుట్ వస్తుందని బాల చందర్ వాదించారు అని అంటారు. దాంతో ఏక్ దూజే కేలియే సినిమాలో గోల్డెన్ చాన్స్ బాలూకి దక్కింది.
భారీ పోటీగానే :
ఈ మూవీ హిట్ కావడంతో 80వ దశకంలో బాలీవుడ్ లో బాలూకి బాలీవుడ్ ఎర్ర తివాచీ పరచేసింది. ఆయన చేత పాటలు పాడించుకోవాలని నాటి టాప్ హీరోలు అంతా ఉత్సాహం చూపించారు. దాంతో ఒక దశలో కిశోర్ కుమార్ కి బాలూ టఫ్ కాంపిటేషన్ ఇచ్చేదాకా వెళ్లారు. అయితే ఎస్పీబీ బొంబాయి వెళ్ళి పాటలు పాడడం వల్ల సౌత్ లో ఆయన సినిమాలకు ఇబ్బంది వస్తోంది అని గ్రహించి ఆయనకు ఆయనే తగ్గిపోయారు. దాంతో బాలీవుడ్ లో సెలెక్టివ్ గానే బాలూ పాడుతూ వచ్చారు అయితే 1990లో ప్రేమ పావురాలు హిందీ వెర్షన్ లో కూడా బాలూ పాడి సల్మాన్ ఖాన్ కెరీర్ కి ప్రాణం పోశారు. దాంతో సల్మాన్ ఖాన్ అయితే బాలూతో పట్టుబట్టి తన సినిమాలకు చాలా పాటలు పాడించుకున్నారు. మొత్తానికి బాలు బాలీవుడ్ మీద పూర్తి ఫోకస్ పెడితే మాత్రం మంచి స్థాయిలో ఉండేవారు అన్నది ఆయన అభిమానుల మాటగా ఎపుడూ ఉంటుంది.