మోనాలిసా పెళ్లిలో ఊహించని మలుపు.. భర్త పై పోక్సో కేస్!
ఈ వ్యవహారం కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇలా వున్నాయి..;
కుంభమేళాలో తన అందంతో, ఆకర్షణీయమైన కళ్లతో సోషల్ మీడియాను షేక్ చేసిన గిరిజన యువతి మోనాలిసా గుర్తుందిగా? ఒక్క ఫోటోతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన ఈమె, ఆ తర్వాత ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే, తాజాగా ఈ ప్రేమ కథలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఆమె మైనర్ అని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ తేల్చడంతో, ఈ వ్యవహారం కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇలా వున్నాయి..
వెలుగులోకి వచ్చిన అసలు వయస్సు:
మోనాలిసా పెళ్లి జరిగినప్పటి నుండి ఆమె వయస్సుపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. మహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రి రికార్డులను పరిశీలించగా, మోనాలిసా 2009 డిసెంబర్ 30న జన్మించినట్లు స్పష్టమైంది. అంటే 2026 మార్చిలో పెళ్లి జరిగే నాటికి ఆమె వయస్సు కేవలం 16 ఏళ్ల రెండు నెలలు మాత్రమే. చట్ట ప్రకారం పెళ్లికి కావాల్సిన వయస్సు లేకపోవడంతో, ఆమె భర్త ఫర్మాన్ ఖాన్‌పై మహేశ్వర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
నకిలీ పత్రాలతో పెళ్లి కుట్ర:
ఈ కేసులో మరో షాకింగ్ విషయం ఏమిటంటే, పెళ్లి కోసం మోనాలిసా పుట్టిన తేదీని మార్చి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని దర్యాప్తులో తేలింది. 2008లో పుట్టినట్లు తప్పుడు ధృవీకరణ పత్రాన్ని చూపించి కేరళలోని నాయనార్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇక దీని వెనుక కొన్ని సంస్థల ప్రమేయం ఉందని, ఇది కేవలం ప్రేమ పెళ్లి మాత్రమే కాదని జాతీయ కమిషన్ ముందు వాదనలు వినిపించారు. అంతర్జాతీయ స్థాయిలో తప్పుడు కథనాలను ప్రచారం చేసేందుకు చేసిన వ్యూహాత్మక ప్రయత్నంగా దీనిని కొందరు అభివర్ణిస్తున్నారు.
72 గంటల్లో చేధించిన మిస్టరీ:
కేరళ నుంచి మధ్యప్రదేశ్ వరకు విస్తరించిన ఈ కేసును విచారణ బృందం కేవలం 72 గంటల్లోనే ఒక కొలిక్కి తెచ్చింది. మహేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన పాత జనన ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని అధికారులు ఆదేశించారు. ఇక మోనాలిసా తల్లిదండ్రులు తమ కుల ధృవీకరణ పత్రాలను సమర్పించడంతో ఆమె షెడ్యూల్డ్ తెగకు చెందిన బాలిక అని కూడా నిరూపితమైంది. ఇక దీంతో తప్పుడు ఆధారాలతో మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నందుకు ఫర్మాన్ ఖాన్ ఇప్పుడు తీవ్ర చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఒక ఫోటో ద్వారా వచ్చిన పాపులారిటీ మోనాలిసా జీవితాన్ని మార్చేస్తుందని అందరూ భావించారు. కానీ, చట్ట వ్యతిరేకమైన పెళ్లి ఆమెను వివాదాల్లోకి నెట్టింది. ప్రేమ పేరుతో మైనర్ బాలికల వయస్సును మరుగున పెట్టి చేసే ఇలాంటి పెళ్లిళ్లు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన నిరూపిస్తోంది. ఇక సోషల్ మీడియా స్టార్‌గా మారిన యువతి ఉదంతం, చట్టానికి ఎవరూ చుట్టాలు కారని మరోసారి గుర్తుచేసింది. ఇప్పుడు ఈ కేసు కోర్టులో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.