• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హిందీ సినిమాకు ప్రాణం...

హిందీ సినిమాకు ప్రాణం లేచొస్తోంది

By - Tupaki Desk
Update: 2016-06-27 17:30 GMT
ఎంతైనా పెద్ద హీరోల సినిమాలు రిలీజైన‌పుడు ఉండే సంద‌డే వేరు. బాలీవుడ్లో ఈ ఏడాది బాక్సాఫీస్ ను క‌ళ‌క‌ళ‌లాడించి బ‌డా మూవీ ఒక్క‌టీ లేదు. షారుఖ్ ఖాన్ సినిమా ‘ఫ్యాన్’  వ‌చ్చింది కానీ.. అది జ‌నాల్ని థియేట‌ర్ల‌కు పెద్ద‌గా ఆక‌ర్షించ‌లేక‌పోయింది. ఈ మ‌ధ్య కాలంలో ఏ షారుఖ్ సినిమాకూ లేనంత త‌క్కువ ఓపెనింగ్స్ వ‌చ్చాయి ఫ్యాన్‌ కు. ఎయిర్ లిఫ్ట్.. హౌస్ ఫుల్-3 లాంటి సినిమాల‌కు మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి కానీ.. మ‌రీ బాక్సాఫీసేమీ షేకైపోలేదు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అస‌లైన ఊపు క‌నిపించేది ఖాన్ త్ర‌యం సినిమాలు వ‌చ్చినపుడే. అవి మంచి టాక్ తెచ్చుకున్న‌పుడే. ఈ ఏడాది తొలి ఆరు నెల‌ల్లో ఆ ఊపే క‌నిపించ‌లేదు. అసలెక్క‌డా క‌లెక్ష‌న్ల రికార్డుల గురించి చ‌ర్చే జ‌ర‌గ‌లేదు.

ఐతే ఎట్ట‌కేల‌కు స‌ల్మాన్ ఖాన్ సినిమా ‘సుల్తాన్’ తో ఆ ఊపు రాబోతోంది. ఈ సినిమా  జులై 6న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వ‌చ్చినా స‌రే.. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇప్ప‌టిదాకా ‘హౌస్ ఫుల్-3 మాత్ర‌మే వంద కోట్ల క్ల‌బ్బులో చేరింది. స‌ల్మాన్ సినిమా ఓపెనింగ్ వీకెండ్లోనే ఆ ఘ‌న‌త సాధించే అవ‌కాశాలున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్.. ఓపెనింగ్స్ విష‌యంలో ‘సుల్తాన్’  హ‌వా సాగ‌డం ఖాయం. సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే ఈజీగా 500 కోట్ల క్ల‌బ్బులో చేరే అవ‌కాశాలున్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఆదిత్య చోప్రా నిర్మాత. అనుష్క శర్మ సల్మాన్ సరసన తొలిసారి కథానాయికగా నటించింది.
Tags:    
  • Salman Khan 
  • Sultan Movie 
  • Telugu NEWs 

Similar News

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS