సుక్కూ.. ఇలాంటివి అవసరమా మీకు

Update: 2017-01-28 09:35 GMT
హేభా పటేల్ ను వేధించిన రాజ్ తరుణ్ ఫ్రెండ్స్.. ఈ లైన్ చదవగానే కుమారి 21ఎఫ్ సినిమా గుర్తొచ్చిందంటే.. దటీజ్ సుకుమార్ స్పెషాలిటీ. సుకుమార్ రైటింగ్స్ అంటూ వచ్చిన మూవీ సెన్సేషనల్ హిట్ అయింది.. ఆ మూవీలో సీన్స్ కూడా అంతగానే ఆకట్టుకున్నాయి.

అయితే. ఇప్పుడు కుమారి 21ఎఫ్ లోని సీన్స్ ను.. సుకుమార్ సొంతసంస్థ 'సుకుమార్ రైటింగ్స్' యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఈ సన్నివేశాలకు పెటిన టైటిల్స్ చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. హీరో రాజ్ తరుణ్ రియలైజ్ అవడానికి కారణమైన సీన్ అని పెడితే.. హుందాగా ఉంటుంది. కానీ దానికి రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ హేభాపటేల్ ను వేధించే సీన్ అంటూ టైటిల్ పెట్టడం  ఆశ్చర్యం. ఇదే కాదు.. హేభాను రాజ్ తరుణ్ ఫోర్స్ చేసేందుకు ప్రయత్నించడం... రాజ్ తరుణ్ కొత్త గాళ్ ఫ్రెండ్ దగ్గరకి వెళ్లడం.. ఇలాంటి టైటిల్స్ చూస్తే.. కచ్చితంగా వ్యూస్ కోసం పెట్టిన సెన్సేషన్ క్రియేట్ చేసే మాదిరిగా ప్రయత్నించినట్లు అర్ధమవుతుంది.

సుకుమార్ లాంటి దర్శకుడు తన సొంత యూట్యూబ్ ఛానల్ లో ఇలాంటి టైటిల్స్ పెట్టడం అంటే ఆలోచించాల్సిన విషయమే. సుకుమార్ మూవీకి టైటిల్ చాలు కదా.. ఇలాంటి సెన్సేషనలిజం అవసరమా ఆనిపించక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News