డైరెక్టర్ తో పెళ్లి.. ఒక్క వీడియోతో క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!
సెలబ్రిటీలు ఎప్పుడైనా ఎవరితో అయినా కలిసి కనిపిస్తే చాలు.. వారి మధ్య ఎఫైర్ రూమర్స్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే.;
సెలబ్రిటీలు ఎప్పుడైనా ఎవరితో అయినా కలిసి కనిపిస్తే చాలు.. వారి మధ్య ఎఫైర్ రూమర్స్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కొక్కసారి ఆ రూమర్స్ నిజం అవుతాయి కూడా.. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బా గురించి కూడా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవడంతో ఈ విషయాలపై ఆమె స్పందిస్తూ రూమర్స్ కి చెక్ పెట్టింది. తెలుగమ్మాయిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈమె గత కొద్ది రోజులుగా ప్రముఖ డైరెక్టర్, నటుడు అయిన తరుణ్ భాస్కర్ తో ప్రేమలో పడిందని, వివాహం కూడా చేసుకోబోతోంది అంటూ రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా వీరిద్దరూ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతి. ఇటు విడుదలకు దగ్గరవుతున్న నేపథ్యంలోనే.. వీరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఈ చిత్రానికి ఏ.ఆర్ సజీవ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది . వచ్చే ఏడాది జనవరి 23న థియేటర్లలోకి రాబోతోంది ఈ సినిమా. ఇటు సినిమాపై అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో.. మరోవైపు వీరిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి అంటూ రూమర్లు జోరుగా వినిపిస్తున్నాయి.
అలా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు ఊపందుకున్నాయి. దీనికి తోడు వీరిద్దరూ ఇటీవల తిరుమలలో కలిసి సందడి చేయగా.. అందుకు సంబంధించిన వీడియోలు , ఫోటోలు కూడా వైరల్ అవ్వడంతోనే ఈ వార్తలు మరింత బలంగా వినిపిస్తున్న కారణంగా.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని పంచుకుంది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని అడిగే వారికి సమాధానంగా ఒక వైరల్ మీమ్ వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో ఒక రాజకీయ నాయకుడు ఇంగ్లీషు స్పీచ్ ని బ్యాగ్రౌండ్ లో ఉపయోగిస్తూ.." ఏ పనులు ఏ సమయంలో జరగాలో.. అవి ఆ సమయంలోనే జరిగి తీరుతాయి" అనే డైలాగ్ జత చేసింది.
మొత్తానికైతే తన పెళ్లిని కాలమే నిర్ణయిస్తుందని.. పెళ్లికి ఇప్పట్లో తొందర ఏమీ లేదు అన్నట్లుగానే కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ వైరల్ మీమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్క వీడియోతో డైరెక్టర్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇన్ని రోజులు వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది. ఇక తాజాగా వీరు నటిస్తున్న ఓం శాంతి శాంతి శాంతి సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా ఒక మలయాళ హిట్ మూవీకి రీమేక్ అన్నట్టు సమాచారం. మరి జనవరి 23న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.