ఆ ఇద్ద‌రి మ‌ధ్య‌లో సుక్కూ...

Update: 2018-04-02 08:28 GMT
రామ్ చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కించిన ‘రంగ‌స్థ‌లం’ సినిమా... రికార్డు లెవెల్లో వ‌సూళ్లు సాధిస్తూ ఇండ‌స్ట్రీ హిట్ దిశ‌గా దూసుకుపోతోంది. ఈ సినిమాలో చిట్టిబాబుగా చ‌ర‌ణ్ న‌ట‌న‌కి ఆయ‌న అభిమానుల‌తో పాటు టాలీవుడ్ హీరోలు కూడా ఫిదా అవుతున్నారు. ‘రంగ‌స్థ‌లం’ సినిమా చూసి... చెర్రీలా మ‌రెవ్వ‌రూ న‌టించ‌లేరంటూ... యంగ్ టైగ‌ర్ ఎన్ టీ ఆర్ పొడుగుతూ పోస్టు చేసిన విష‌యం తెలిసిందే.

ఈ ట్వీట్‌కు స్పందించిన హీరో రామ్ చ‌ర‌ణ్‌... ‘థ్యాంక్యూ బ్ర‌ద‌ర్‌...’ అంటూ రిప్లై ఇచ్చాడు. త‌న‌తో ‘నాన్న‌కు ప్రేమ‌తో’ సినిమాను తీసిన ద‌ర్శ‌కుడు సుకుమార్ గురించి పొడిగేశాడు తార‌క్‌. దానికి స్పంద‌న‌గా ఎన్ టీ ఆర్‌- రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య‌లో  నిల్చొని  ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశాడు సుకుమార్‌. ‘రంగ‌స్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ ట్వీట్ట‌ర్ అకౌంట్ ద్వారా దీన్ని పోస్ట్ చేశాడు. ఈ ఫోటో చెర్రీ గుబురు గడ్డంతో ఉండ‌డం చూస్తే... ఇది పాత ఫోటో అని తెలుస్తోంది. అయితే రాజ‌మౌళి- రామ్ చ‌ర‌ణ్ - రామారావు క‌లిసి సోఫాలో చ‌నువుగా కూర్చొని దిగిన ఫోటోకి వ‌చ్చినంత పాపులారిటీ ఈ ఫోటోకి వ‌చ్చేస్తోంది. లెక్క‌ల మాస్టారితో కూడా ఈ హీరోలు అంతే చ‌నువుగా భుజం మీద చేతులేసి ఫోటోకి ఫోజు ఇవ్వ‌డ‌మే దీనికి కార‌ణం.

రాజ‌మౌళితో క‌లిసి ఈ ఇద్ద‌రూ ఫోటో దిగిన‌ప్పుడు... ముగ్గురి కాంబినేష‌న్లో ఓ మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌బోతుంద‌నే వార్త సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టింది. అది జ‌రిగిన చాలా రోజుల త‌ర్వాత ఆ సినిమా అధికారికంగా ఖ‌రారైంది. ఇప్పుడు సుక్కూతో ఈ ఫోటో కార‌ణంగా  మ‌రో మ‌ల్టీస్టార‌ర్ వార్త‌లు వ‌చ్చిన రావ‌చ్చేమో మ‌రి! ‘రంగ‌స్థ‌లం 2’లో తార‌క్ కూడా ఉన్నాడంటారేమో...
Tags:    

Similar News