ఈ కన్ ఫ్యూజన్ ఏంటి సుక్కు?
ఈ రోజు ఊహించని విధంగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో కొత్త సినిమా ప్రకటన వెలువడటం మహేష్ బన్నీల ఫ్యాన్స్ ఇద్దరినీ అయోమయంలో పడేసింది. మహేష్ బాబు ప్రాజెక్ట్ నిన్నే ఓకే అయ్యిందన్న వార్త ఇంకా చల్లారకుండానే సుకుమార్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అంటే షాక్ తగలకుండా ఉంటుందా. త్రివిక్రమ్ తో ఓకే చేయించుకున్న సుక్కు దగ్గర రెడీగా రెండు స్క్రిప్ట్ లు ఉన్నాయా అనే అనుమానం కలగడం సహజం.
రంగస్థలం టైంలో అసలు మైత్రి సంస్థ సుకుమార్ తో ఎన్ని సినిమాలకు అగ్రిమెంట్ చేయించుకుంది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మహేష్ మూవీ అదే సంస్థలో వస్తోంది. ఇప్పుడు అనౌన్స్ చేసిన బన్నీ కూడా అదే బ్యానరే. కాకపోతే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే వివరాలు చెప్పలేదు కాబట్టి ఈ ఏడాది చివర్లోనో లేదా వచ్చే సంవత్సరం మొదట్లోనో ఉండొచ్చు ఇదంతా ఈ ఇద్దరు హీరోలకు చెప్పే సుకుమార్ మరియు మైత్రి సంస్థ ఇవి ప్రకటించారా అనేది తెలియాల్సి ఉంది.
మహేష్ తన సినిమాల దర్శకులు తన ప్రాజెక్ట్ మీద మాత్రమే ఫోకస్ చేయాలనీ కోరుకుంటాడని సన్నిహితులు అంటుంటారు. కాని ఇప్పుడు వచ్చిన న్యూస్ ని బట్టి సుకుమార్ మహేష్ సినిమా చేస్తూనే బన్నీ స్క్రిప్ట్ మీద కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాల్సిన మూవీ వీలైనంత త్వరగా పూర్తి చేసి బన్నీ వేగంగా ఇంకొకటి మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ఏడాది గ్యాప్ వస్తోంది. వెంటవెంటనే రెండు చేస్తే ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని కలిగించినట్టు అవుతుంది. మొత్తానికి మహేష్ బన్నీల మధ్యలో సుకుమార్ స్క్రిప్ట్ గేమ్ ఆడాల్సి వచ్చేలా ఉంది