కింగ్ డమ్ సెకండ్ హాఫ్.. ఇంత పెద్ద కథ నడిచిందా..?
విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కింగ్ డమ్. ఈ ఇయర్ భారీ అంచనాలతో వచ్చిన సినిమాల్లో ఇది ఒకటి. ఐతే మూవీ మాత్రం అంచనాలను అందుకోలేదు.;
విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కింగ్ డమ్. ఈ ఇయర్ భారీ అంచనాలతో వచ్చిన సినిమాల్లో ఇది ఒకటి. ఐతే మూవీ మాత్రం అంచనాలను అందుకోలేదు. విజయ్ దేవరకొండ ఎనర్జీని గౌతం తిన్ననూరి సరిగా వాడుకోలేదు. ఐతే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఓకే కానీ సెకండ్ హాఫ్ దెబ్బ వేసింది. ఇదే విషయంపై ఆ సినిమా నిర్మాత నాగ వంశీ రీసెంట్ ఇంటర్వ్యూలో అసలు జరిగిన స్టోరీ చెప్పారు. కింగ్ డమ్ సినిమా సెకండ్ హాఫ్ పై చాలా డౌట్లు ఉన్నాయి. బాబాయ్ రాధాకృష్ణ గారు కూడా గౌతం తో మాట్లాడారు.
జెర్సీ తీసిన డైరెక్టర్ కాబట్టి..
దాదాపు 3 నెలల పాటు ఈ డిస్కషన్ జరిగింది. అయినా సరే గౌతం తన పట్టు విడవలేదు. మళ్లీ రావా, జెర్సీ సినిమాలు తీసిన డైరెక్టర్ కాబట్టి స్టీరియో టైప్ బ్రేక్ ఇద్దామని అతని కన్విక్షన్ కే వదిలేశాం. కానీ అది సినిమా రిజల్ట్ మీద పడిందని అన్నారు. కింగ్ డమ్ సెకండ్ హాఫ్ మీద నాగ వంశీ అసంతృప్తి రిలీజ్ ముందే ఉందన్న విషయం ఈ కామెంట్స్ ద్వారా అర్థమైంది.
దర్శకుడి విజన్ ని నమ్మి నిర్మాత డబ్బులు పెడతాడు. ఒక్కోసారి నిర్మాత చెప్పే సలహాలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే అతను కేవలం నిర్మాతగానే కాదు ఒక ఆడియన్ గా తన జడ్జిమెంట్ ఇస్తాడు. జెర్సీ తీసిన డైరెక్టర్ కాబట్టి గౌతం మీద నమ్మకం ఉంచి కింగ్ డం ని తనకు ఇష్టం వచ్చినట్టుగా తీసే ఛాన్స్ ఇచ్చారు. కానీ అది మిస్ ఫైర్ అయ్యింది. కింగ్ డం సెకండ్ హాఫ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే కచ్చితంగా విజయ్ ఖాతాలో ఒక మంచి సక్సెస్ పడేది.
ప్రతి సినిమాపై నాగ వంశీ ఇచ్చే హైప్..
సితార నుంచి వచ్చే ప్రతి సినిమాపై నాగ వంశీ ఇచ్చే హైప్ కూడా సినిమాల ఫలితంపై ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. కింగ్ డమ్ విషయంలో కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా మీరు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా భారీగా ఉంటుందని అన్నాడు. సినిమా భారీగానే ఉంది కానీ అది ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోయింది. నాగ వంశీ ఇదే ఇంటర్వ్యూలో నానితో నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో సినిమా ఉంటుందని చెప్పారు. డైరెక్టర్, స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని వెల్లడించారు.
గౌతం తిన్ననూరి కింగ్ డమ్ రిజల్ట్ తెలిసింది. ఐతే కింగ్ డమ్ సీక్వెల్ కూడా ఒకటి ఉంటుందని చివర్లో హింట్ ఇచ్చారు. ఐతే పార్ట్ 1 రిజల్ట్ సాటిస్ఫైడ్ కాదు కాబట్టి కింగ్ డమ్ 2 ఛాన్స్ లేదనే చెప్పొచ్చు. అంతేకాదు ఇక మీదట తమ బ్యానర్ లో సినిమాల విషయంలో త్రివిక్రం గారితో డిస్కషన్ చేస్తున్నామని ఆయన ఇన్వాల్వ్ అవ్వని రెండు సినిమాలు రిజల్ట్ లు తేడా కొట్టేశాయని అన్నారు నాగ వంశీ.