120కోట్ల మంది వీక్షించిన సిరీస్‌కి ఎండ్ కార్డ్

దాదాపు 120 కోట్ల మంది వీక్షించారు ఈ వెబ్ సిరీస్‌ని.. ఇది నిజంగా ఓటీటీ రంగంలో పెను సంచ‌ల‌నం.;

Update: 2025-12-27 00:30 GMT

దాదాపు 120 కోట్ల మంది వీక్షించారు ఈ వెబ్ సిరీస్‌ని.. ఇది నిజంగా ఓటీటీ రంగంలో పెను సంచ‌ల‌నం. నెట్ ఫ్లిక్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఎక్కువ‌మంది వీక్షించిన సిరీస్‌గా రికార్డులు నెల‌కొల్పింది. ఈ సిరీస్ -స్ట్రేంజ‌ర్ థింగ్స్. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ప్ర‌తిదీ కొత్త కొత్త‌గా ఉంటుంది. ఏం జ‌రుగుతుందో చూడాల‌న్న ఉత్కంఠ నిల‌వ‌నీయ‌దు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న యువ‌త‌రాన్ని క‌ట్టి ప‌డేసింది.

ఇప్పటివరకు అత్యధికంగా వీక్షించిన ఆంగ్ల భాషా సిరీస్‌గా రికార్డుల‌కెక్క‌గా, నాన్సీ వెక్నా ట్రాన్స్ -డస్టిన్ `నెవర్ ఎండింగ్ స్టోరీ` డ్యూయెట్‌ను ఆడియెన్ తిరిగి చూస్తున్నారు. ఈ సిరీస్ ఇక‌ పూర్తయ్యే దశకు చేరుకుంది. ముగింపుకు ముందు ఇది మ‌రిన్ని రికార్డుల‌ను బ్రేక్ చేస్తుందా? అంటూ చ‌ర్చ సాగుతోంది. నూతన సంవత్సర వేడుకలో 2 గంటల ముగింపు సహా పొడవైన ఎపిసోడ్‌లతో వాల్యూమ్ 2 ను కూడా ఇప్పుడు రిలీజ్ చేసారు. ప‌దేళ్ల త‌ర్వాత ముగింపు దశ అభిమానుల్లో ఎంతో ఉద్విగ్న‌త‌ను పెంచుతోంది. మొత్తం ఐదు సీజన్లలో `స్ట్రేంజర్ థింగ్స్` 120కోట్ల మంది (1.2 బిలియన్) వీక్షణలతో రికార్డుల‌కెక్కింది. ఆ నిర్మాణ సంస్థ దాదాపు 8,000 నిర్మాణ ఉద్యోగాలను సృష్టించింది. ప్రసార సమయంలో అమెరికా స్థూల దేశీయ ఉత్పత్తికి 1.4 బిలియన్ డాల‌ర్ల ఆదాయాన్ని తెచ్చింది.

స్ట్రేంజ‌ర్ థింగ్స్ చివ‌రి ఎపిసోడ్ వివ‌రాల గురించి మ‌రింత లోతుగా వెళితే.. సీజ‌న్ లో ఐదవది, చివరి సీజన్ మూడు వాల్యూమ్‌లుగా విడుదలైంది. నాలుగు ఎపిసోడ్‌లతో కూడిన వాల్యూమ్ 1 నవంబర్ 26న ప్రీమియర్ అయింది. వాల్యూమ్ 2 క్రిస్మస్ సందర్భంగా (డిసెంబర్ 25) అమెరికాలో విడుదలైంది. అయితే ఇది డిసెంబర్ 26న భారతదేశంలో ప్రీమియర్ అయింది. ఇందులో ఐదు, ఆరు, ఏడు ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి `చాప్టర్ 8: ది రైట్‌సైడ్ అప్` అనే చివరి అధ్యాయంపై ఉంది. ఇది డిసెంబర్ 31 బుధవారం రాత్రి 8 గంటలకు విడుదల కానుంది. అంటే గురువారం 1 జనవరి 2026 ఉదయం 6:30 గంటలకు స్ట్రీమ్ వీక్షించ‌గ‌లం.

ఎనిమిదవది- చివరి ఎపిసోడ్ 2 గంటల 8 నిమిషాలు నడుస్తుందని .. ఇది షో చరిత్రలోనే అతి పొడవైన వాటిలో ఒకటిగా నిలుస్తుంద‌ని చెబుతున్నారు. 5-7 ఎపిసోడ్‌లు ఒక్కొక్కటి గంటకు పైగా నడుస్తాయి, అయితే ముగింపు ఒక సినిమా నిడివిని పోలి ఉంటుంది.

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 3

నెట్‌ఫ్లిక్స్‌లో చివరి షోడౌన్ .. డిసెంబర్ 31 - జనవరి 1న యునైటెడ్ స్టేట్స్, కెనడా అంతటా 500 కి పైగా థియేటర్లలో చివరి ఎపిసోడ్ ప్రదర్శితం కానుంది. థియేటర్ రన్ స్ట్రీమింగ్ విడుదలతో ఏకకాలంలో ప్రారంభమవుతుంది, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ముగింపును పెద్ద తెరపై చూసే అవకాశం ఇస్తుంది.

ఈ సిరీస్‌లో మిల్లీ బాబీ బ్రౌన్, నోహ్ ష్నాప్, ఫిన్ వోల్ఫ్‌హార్డ్, నటాలియా డయ్యర్, చార్లీ హీటన్, మాయా హాక్, జో కీరీ, సాడీ సింక్, జామీ కాంప్‌బెల్ బోవర్, వినోనా రైడర్, డేవిడ్ హార్బర్, గేటెన్ మాటరాజో, కాలేబ్ మెక్‌లాఫ్లిన్, కారా బ్యూనో, మాథ్యూ మోడిన్, ప్రియా ఫెర్గూసన్, బ్రెట్ గెల్మాన్, లిండా హామిల్టన్ త‌దిత‌రులు న‌టించారు.

ఈ సిరీస్ క‌థాంశం ఆస‌క్తిక‌రం. 1980లలో ఇండియానాలో కొంద‌రు యువ స్నేహితుల బృందం అతీంద్రియ శక్తులతో ప్రాపంచిక వ్య‌వ‌హారాల‌ను ఎలా డీల్ చేసార‌న్న‌ది ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఇందులో కిడ్స్ కొన్ని అసాధార‌ణ విన్యాసాల‌తో అల‌రిస్తారు.

Tags:    

Similar News