సినిమా మేకింగ్ లో మ్యాథ్స్, సైన్స్ ఆలోచించం : స్వప్న దత్
రోషన్, అనస్వర రాజన్ జోడీగా ప్రదీప్ అధ్వైతం డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఛాంపియన్. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ లో ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు.;
రోషన్, అనస్వర రాజన్ జోడీగా ప్రదీప్ అధ్వైతం డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఛాంపియన్. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ లో ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా క్రిస్ మస్ రోజున డిసెంబర్ 25న రిలీజైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంధి ఆదరణ లభించడంతో చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత స్వప్న షాకింగ్ కామెంట్స్ చేశారు.
కత్తి లాంటి అమ్మాయి చక్కనైన అమ్మాయి..
మా బ్యానర్ లో వచ్చింది కాబట్టే ఈ సినిమాను కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. అదే వేరే వాళ్లు చేసి ఉంటే మాత్రం అద్భుతం అనే వాళ్లని అన్నారు. ప్రతి సినిమాను కష్టపడి చేయాలని తాము కోరుకుంటామని.. తేలికగా చేసే సినిమాలు చేయడం కన్నా ఇలాంటి సినిమాలనే చేయడం మా బ్యానర్ ప్రత్యేకత అని అన్నారు. కత్తి లాంటి అమ్మాయి చక్కనైన అమ్మాయి పెట్టుకుని ఒక లవ్ స్టోరీ చేయడం చాలా ఈజీ.. కానీ మేము ఒక బలమైన కథను కొన్నాళ్లు గుర్తుండిపోయేలా చేయాలని అనుకున్నామని అన్నారు స్వప్న దత్.
ఐతే సినిమా రన్ టైం గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నిర్మాత స్వప్న దత్ సమాధానమిస్తూ సీన్స్ కట్ చేసుకుంటూ వెళ్తే సినిమాలో ఏమి ఉండదని అన్నారు. ఇక ఈ సినిమా కోసం రోషన్ పెట్టిన ఎఫర్ట్ గురించి చెప్పారు స్వప్న దత్. ప్రదీప్ ఈ సినిమా కథ చెప్పినప్పటి నుంచి హీరోగా ఎవరిని తీసుకోవాలా అన్న డిస్కషన్ జరిగింది. అప్పుడే రోషన్ ఆలోచనలోకి వచ్చాడు. ఈ సినిమాకు రోషన్ చేయాల్సిందంతా చేశాడు.
ఛాంపియన్ పూర్తి చేసిన తర్వాతే మరో సినిమా..
సినిమా టైం పడుతుంది.. వేరే సినిమా చేసుకో అని చెప్పినా సరే ఛాంపియన్ ని పూర్తి చేసిన తర్వాతే మరో సినిమా అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు రోషన్. తప్పకుండా తనకు మంచి కెరీర్ ఉంటుందని అన్నారు స్వప్న దత్. ఇక నెక్స్ట్ తమ బ్యానర్ లో రాబోతున్న కల్కి 2 ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు స్వప్న దత్.
సినిమా మేకింగ్ లో మ్యాథ్స్, సైన్స్ ఆలోచించమని అన్నారు స్వప్న దత్. ఒక కథ తమని వెతుక్కుంటూ వచ్చిందంటే అది చేస్తాం. అదేంటో మా దగ్గరకు కష్టమైన కథలే వస్తున్నాయి. అందుకే మేము అలాంటి సినిమాలే చేస్తున్నామని అన్నారు నిర్మాత స్వప్న దత్. వైజయంతి బ్యానర్ సినిమా అంటే ఒక బ్రాండ్ ఉంటుంది. అశ్వనిదత్ తర్వాత నిర్మాణ బాధ్యతలను తీసుకున్న స్వప్న, ప్రియాంక దత్ కూడా బ్యానర్ కు ఉన్న వాల్యూని ఎక్కడ తగ్గించకుండా మంచి సినిమాలు చేస్తున్నారు. మహానటి, సీతారామం తో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యానర్ లో ఛాంపియన్ తెరకెక్కింది.