సుకుమార్ హర్ట్ అయితే ఆయనకే నష్టం
మహేశ్ సుకుమార్ సినిమా ఆగిపోయిడం ఇప్పుడు టాలీవుడ్ సన్షేషన్ గా మారింది. సుకుమార్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ తో మహేశ్ అనవసరంగా సినిమా వదులుకున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. రంగస్థలం తర్వాత సుకుమార్ చేయబోయే సినిమాకు అంచనాలు ఏర్పడతాయి. దీంతో.. సినిమా ఎలా ఉన్నా పక్కా ఓపెనింగ్ గ్యారెంటీ. మరి మహేశ్ తొందరపడ్డాడేమో అని మరికొంత భావిస్తున్నారు. ఏదైతేనేం.. తన కథతో మహేశ్ ని ఇంప్రెస్ చేయలేకపోయాడు సుక్కు. దీంతో.. మహేశ్ వేరే ఆప్షన్ చూసుకోవాల్సి వచ్చింది. సుకుమార్ కి ఎక్కడో కాలింది. అందుకే వెంటనే బన్నీతో సినిమా ఎనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు.
అర్హత ఉన్నవాడికి అహంకారం కూడా అలంకారం అని పెద్దలు చెప్తారు. ఈ సూక్తి ప్రకారం చూసినా .. సుక్కుకి చాలా ఇగో ఎక్కువ. అసలు ఎక్కడా తగ్గడు. కానీ కోపమే అతడి కొంపముంచుతుంది. కోపంలో అనవసర ఆర్భాటాలకు పోయి ఫ్లాపులు కొనితెచ్చుకుంటాడు. గతంలో కూడా ఇలాగే జరిగింది. ఆర్య సినిమా హిట్టైన తర్వాత సుక్కు గాల్లో ఉన్నాడు. ఎవ్వరి మాట వినడం లేదు. ఈ టైమ్‌లో రామ్ తో జగడం సినిమా ప్లాన్ చేశాడు. ఇది కూడా ఆర్య తీసిన దిల్ రాజు బ్యానర్ లోనే. అయితే.. రామ్ ఏజ్ కు జగడం ఎక్కువ అవుతుంది.. సినిమా ఆడదు అని దిల్ రాజు చెప్పాడు. సుక్కూ ఒప్పుకోలేదు. మీరు కాకపొతే.. బొచ్చెడుమంది అంటూ బయటకు వచ్చి వేరే నిర్మాతలతో పంతానికి పోయి సినిమా తీశాడు. రిజల్ట్… సినిమా బావుందని పేరొచ్చింది కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో.. అప్పటినుంచి కష్టపడితే.. పదేళ్లకు కానీ రంగస్థలంతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకోలేకపోయాడు. సో.. ఎలాచూసినా సుకుమార్ కోపమే సుకుమార్ శత్రువు.