ఆ సీన్లేవి సిట్టి బాబూ?

Update: 2018-04-01 06:39 GMT
ముందు అందరు భయపడ్డారు కాని మూడు గంటల వ్యవధి రంగస్థలంకు పెద్ద అడ్డంకి అయ్యేలా కనిపించడం లేదు. లెంగ్త్ తగ్గించి ఉంటే బాగుండేది అనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ ఆ ఎమోషన్ ని క్యారీ చేయాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ ఏకీభవిస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. కాని సినిమాను నిశితంగా గమనించిన వారికి కొన్ని సీన్స్ పట్ల వస్తున్న సందేహాలు మాత్రం సుకుమార్ ఒక్కడే తీర్చగలడు. ముఖ్యంగా  చిట్టిబాబు ఇంట్రోనే ఒక పామును వెతుకుతున్నట్టు చూపించిన సుకుమార్ తర్వాత చరణ్ దాన్ని మళ్ళి ఎక్కడా పట్టుకున్నట్టు చూపించడు. మరి స్క్రిప్ట్ లో భాగంగా తీయలేదో లేక ఎడిటింగ్ టేబుల్ లో ఎగిరిపోయిందో చెప్పలేం.

తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన కుమార్ బాబు హీరో చిట్టిబాబుతో కలిసి ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళే సీన్ ఒకటి ఉంటుంది. అందులో చెప్పులు బయటే వదిలి ఇద్దరు లోపలి వెళ్తారు. అక్కడ ఉన్న అజయ్ ఘోష్ ఆది గురించి జగపతిబాబుకి చెబుతాడు. అక్కడ కంటిన్యుయేషన్ మిస్ అయ్యింది. దుబాయ్ నుంచి కుమార్ బాబు ప్రెసిడెంట్ కు ఏదో కానుక  ఇచ్చాడు అనే కాన్సెప్ట్ నిజానికి కథలో లింక్ గా ఉందట. కాని ఫైనల్ వెర్షన్లో అది అంతగా అవసరం లేదు అనిపించడంతో కుమార్ బాబుకి జగపతిబాబు జరిగిన మొదటి పరిచయం సీన్ సినిమాలో లేదని టాక్.

ఇక ఇంటర్వెల్ కన్నా ముందు బిడిఒ ఆఫీస్ కు వెళ్లి నామినేషన్ వేసే టైంలో బ్రహ్మాజీ ప్రెసిడెంట్ పేరు అతని గురించిన పూర్తి వివరాలు అన్నదమ్ములకు చెప్పే సీన్ కూడా ట్విస్ట్ క్యారీ చేయటం కూడా లేపెసారని తెలిసింది. రంగమ్మత్త భర్తను చంపేసే సీన్లో కూడా ఊరందరికీ తెలియకుండా తను ఒక్కర్తే గుట్టుగా అంత్యక్రియలు ఎలా చేసింది అనే ఎపిసోడ్ కూడా ఇందులో లేదు. నిజానికి అనసూయను జగపతి బాబు పిలిపించి భర్త చావు గురించి ఎవరికి చెప్పకని బెదిరించే సీన్ కూడా షూట్ చేసారట. అది కూడా ఎడిటింగ్ లో మాయమయ్యిందని టాక్. ఏదైతేనేం మొత్తానికి శుభం కార్డు పడి సక్సెస్ అయ్యింది.

Tags:    

Similar News