చిరూతో సినిమా నిజం కాద‌ట‌

Update: 2018-03-24 10:31 GMT
క్లాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు - సంవ‌త్స‌ర కాలంగా ‘రంగ‌స్థ‌లం’ సినిమాను చెక్కుతున్నాడు. ఎండ‌లు, రీ షూట్‌లు... త‌దిత‌ర  కార‌ణాల వ‌ల్ల‌ షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు వ‌చ్చే వారం విడుద‌లకు సిద్ధ‌మవుతోంది. అయితే ఈ సినిమా ఫైన‌ల్ కాపీని చూసిన మెగాస్టార్‌ - ద‌ర్శ‌కుడు సుకుమార్‌ ను ఆకాశానికి ఎత్తేశాడు. రామ్‌ చ‌ర‌ణ్‌ ను అద్భుతంగా చూపించాడ‌ని, అన్ని అవార్డులు రంగ‌స్థలానికే వ‌చ్చేస్తాయ‌ని పొగిడేశాడు.

దాంతో టాలీవుడ్‌ లో ఓ రూమ‌ర్ త‌యారైంది. సురేంద‌ర్ రెడ్డితో ‘సైరా’ సినిమా చేస్తున్న చిరంజీవి, త‌న త‌ర్వాతి సినిమా సుకుమార్‌తో చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నాడ‌నీ - క‌థ త‌యారుచేసుకోమ‌ని లెక్క‌ల మాస్టారుకి చెప్పిన‌ట్టుగా వార్తలు షికారు చేస్తాయి. దీనిపై అటు మెగాస్టార్ కానీ - ఇటు సుకుమార్ గానీ నోరు మెద‌ప‌క‌పోవ‌డంతో ఈ వార్త‌ను నిజ‌మే అనుకున్నారంతా. అయితే ఎట్టేకేలకు ఈ వార్త‌ల‌పై సుకుమార్ నోరు విప్పాడు. చిరంజీవికి తాను పెద్ద అభిమానిన‌ని ప్ర‌క‌టించుకున్న సుకుమార్‌ - చిరూ సినిమాలు చూస్తూనే పెరిగాన‌ని చెప్పుకొచ్చాడు. అయితే చిరూతో సినిమా చేయాల‌నే క‌ల త‌న‌కూ ఉంది కానీ ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న కోసం క‌థ రాసుకోవ‌డం గానీ, దాన్ని ఆయ‌న‌కు వినిపించ‌డం గానీ జ‌ర‌గ‌లేద‌ని... ఆ వార్త‌లు కేవ‌లం రూమ‌రేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాడు.

దీంతో కొన్ని నెల‌లుగా సుకుమార్‌ తో చిరూ సినిమా ఉంటుంద‌ని ఆశించిన అభిమానులు తీవ్రంగా నిరాశ‌ప‌డుతున్నాయి. రంగ‌స్థ‌లం విడుద‌ల అయిన త‌ర్వాత మెగా అల్లుడు స్టైలిష్‌ స్టార్ అల్లుఅర్జున్‌ తో సినిమా చేయాల‌ని భావిస్తున్నాడ‌ట సుకుమార్‌. సుకుమార్‌ తో బ‌న్నీ సినిమా అన‌గానే ‘ఆర్య 3’ సినిమా ఉంటుందేమోన‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. 
Tags:    

Similar News