బన్నీ వెళ్లింది విహార యాత్రకు కాదు

Update: 2020-09-14 14:30 GMT
అల్లు అర్జున్‌ ఇటీవల అదిలాబాద్‌ లోని కుంటాల జలపాతాన్ని సందర్శించాడు. తన సన్నిహితులతో కలిసి జలపాతం వద్దకు వెళ్లిన అక్కడ చాలా సమయం గడిపాడు. ఆయనకు అక్కడి అటవి శాఖ అధికారులు దగ్గరుండి మరీ జలపాతం చూపించడంతో పాటు ఇతర ప్రాంతాలను చూపించారు. సోషల్‌ మీడియాలో ఈ సమయంలో విహార యాత్ర ఏంటీ బన్నీ అంటూ చాలా మంది ట్రోల్స్‌ చేశారు. కుంటాల జలపాతం వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు. కాని బన్నీని స్వయంగా అధికారులు తీసుకు వెళ్లి చూపించడంలో ఆంతర్యం ఏంటీ అంటూ ఎవరికి ఇష్టం వచ్చిన తీరుగా వారు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. బన్నీపై వస్తున్న ట్రోల్స్‌ కు ఆయన టీం నుండి అనధికారికంగా స్పందన వచ్చింది.

బన్నీ కుంటాల జలపాతంను చూసేందుకు ప్రత్యేకంగా వెళ్లలేదని పుష్ప సినిమా షూటింగ్‌ కోసం లొకేషన్స్‌ పరిశీలనలో భాగంగా వెళ్లడని అన్నారు. కరోనా కారణంగా విమానంలో ప్రయాణాలు కాస్త రిస్క్‌ తో కూడుకున్నది. అందుకే బన్నీ జాగ్రత్తలు తీసుకుని కారులో మహారాష్ట్ర వరకు వెళ్లారు. అక్కడ తిప్పేశ్వర్‌ ప్రాంతానికి చెందిన అటవి ప్రాంతం ఎంత వరకు పుష్ప సినిమాకు ఉపయోగంగా ఉంటుందనే విషయం తెలుసుకునేందుకు వెళ్లినట్లుగా వారు చెబుతున్నారు.

కేరళలో షూటింగ్‌ జరపాలని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అనూహ్యంగా కరోనా వచ్చి ఆగిపోయింది. దాంతో మళ్లీ కొత్త లొకేషన్స్‌ ను వెదికే పనిలో చిత్ర యూనిట్‌ సభ్యులు పడ్డారు. బన్నీ వెళ్లి స్వయంగా లొకేషన్స్‌ పరిశీలించడంతో పాటు అక్కడ కలిసిన వారితో సామాజిక దూరం పాటిస్తూ అభిమానులతో మాట్లాడాడు. సుకుమార్‌ సూచన మేరకు బన్నీ వెళ్లి ఆ లొకేషన్స్‌ కు వెళ్లాడట.
Tags:    

Similar News