బ్రాండ్ సుక్కూకి బీటలు పడ్డాయ్
తను రాసిన కథను తానే అన్ని మీడియాలకూ తిరిగి ప్రమోట్ చేసుకున్నాడు బాగానే ఉంది.. కాని తను రాయని కథకు కూడా అలాగే తిరిగి ప్రమోట్ చేస్తే ఏమవుతుంది? ఏదో సరదాకి తను రాయలేదు అని చెబుతున్నాడులే కాకపోతే అంతా మనోడే చేసుంటాడు అని జనాలు అనుకున్నారు. అలా అనుకోవడంతోనే ఇప్పుడు అసలు సమస్య వచ్చింది. సుకుమార్ అనే బ్రాండ్ కు కాసినన్ని బీటలు పడ్డాయ్. పదండి చూద్దాం.
'దర్శకుడు' సినిమా కథలో పెద్దగా వైవిధ్యం లేకపోయినా కూడా.. సుకుమార్ వంటి ఎక్సపీరయిన్స్ ఉన్న దర్శకుడు దానిని హ్యాండిల్ చేస్తే రిజల్ట్ ఇంకోలా ఉండేది. ఆ మాటకొస్తే సుక్కూ ఇప్పటివరకు తీసిన ఏ సినిమాలోనూ గొప్ప కథ లేదు. కాని గొప్ప కథనం ఉంది. లాజిక్ ఉంది. ఎమోషన్ మిస్సవ్వలేదు. కాకపోతే దర్శకుడు రైటర్ హరిప్రసాద్ జక్కా మాత్రం ఆ విషయంలో తడపడ్డాడు. అందుకే 'దర్శకుడు' సినిమాకు నెగెటివ్ రివ్యూలు గట్టిగానే వచ్చాయ్. అయితే ఈ సినిమాకు సుకుమార్ బ్రాండ్ చూసి వచ్చినవారే ఎక్కువ. కుమారి 21 ఎఫ్ వంటి సినిమాను ప్రొడ్యూస్ చేసిన సుక్కూ చెప్పాడు కాబట్టే చూశారు. సుక్కూ కోసమే ఓపెనింగు టిక్కెట్లు తెగాయ్. కాని ఇప్పుడు సినిమా మరీ పేలవంగా ఉండటంతో.. సుకుమార్ మీద ఉన్న గౌరవం కాస్త తగ్గింది. సుక్కూ చెప్పినా కూడా సినిమాను చూడాలంటే కాస్త ఆలోచించాల్సిందే అనే ఆలోచనలో పడ్డారు జనాలు.
కాకపోతే సుకుమార్ డైరక్షన్లో వస్తున్న రంగస్థలం 1985 సినిమాపై ఈ బీటల ప్రభావం ఉండకపోవచ్చు కాని.. మనోడు తదుపరి తీసే ప్రొడక్షన్ వెంచర్లపై మాత్రం ఈ ప్రభావం గట్టిగా పడుతుంది. జాగ్రతబ్బాయ్!!