బ్రేకులు పడకుండా చూసుకుంటున్నారు

Update: 2017-05-17 06:20 GMT
రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ఏప్రిల్ మొదట్లోనే ప్రారంభమైంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న యూనిట్.. రెండో షెడ్యూల్ కూడా మొదలుపెట్టేశారు. సహజంగా సినిమాలు తీయడంలో సుకుమార్ చాలా నెమ్మదిగా ఉంటాడు. కానీ చెర్రీ సినిమాను మాత్రం శరవేగంగా తీయాలన్నది ప్లాన్.

సెప్టెంబర్ నాటికి మెగా పవర్ స్టార్ మూవీ పూర్తి చేసేసేలా ప్లాన్ చేసుకున్నాడు సుకుమార్. నిజానికి సెప్టెంబర్ నాటికి ఫ్రీ అయిపోవడం చెర్రీకి కూడా చాలా ముఖ్యం. అదే నెలలో మెగాస్టార్ చిరంజీవి 151వ మూవీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పటికి తను హీరోగా రూపొందే సినిమాను పూర్తి చేసేయాలన్నది చెర్రీ ఆలోచన. అందుకే సుక్కు సినిమాకు చిన్నపాటి బ్రేకులు కూడా వేయకుండా సపోర్ట్ చేస్తున్నాడు.

మరోవైపు సుకుమార్ కూడా ఫుల్ స్వింగ్ లో షూటింగ్ చేసేస్తున్నాడు. చిన్న చిన్న గ్యాప్స్ తప్ప.. లాంగ్ బ్రేక్స్ లేకుండా చసుకుంటున్నాడు. 1990కాలం నాటి పల్లెటూరి ప్రేమగాధగా చెర్రీ-సుకుమార్ ల సినిమా రూపొందనుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి మెజారిటీ పోర్షన్ గోదావరి తీరాన షూట్ చేయనుండగా.. కొన్ని పాటలను మాత్రం హైద్రాబాద్ లోని సెట్స్ లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News