"అవును.. నాలో ఇన్ సెక్యూరిటీ ఉంది".. అనసూయ కామెంట్స్ పై శివాజీ రియాక్షన్
దండోరా ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై యాంకర్ అనసూయ శివాజీపై పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.;
దండోరా ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై యాంకర్ అనసూయ శివాజీపై పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆమె డైరెక్ట్ పేరు మెన్షన్ చేయకుండా ఆడవారి వస్త్రధారణ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అని అది కంట్రోల్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదని ఘాటుగా స్పందించారు. అలాగే శివాజీకి ఇన్ సెక్యూరిటీ ఉందని అన్న మాటలకు నటుడు శివాజీ నేడు జరిగిన ప్రెస్ మీట్ లో సూటిగా సమాధానం ఇచ్చారు.
అనసూయ గారు తన ఇన్ సెక్యూరిటీ గురించి మాట్లాడారని, అవును తనకు నిజంగానే ఇన్ సెక్యూరిటీ ఉందని ఆయన ఒప్పుకున్నారు. అయితే ఆ ఇన్ సెక్యూరిటీ వెనుక ఉన్న కారణాన్ని ఆయన వివరించారు. "మా హీరోయిన్లు బయటకు వెళ్లినప్పుడు జనం వారి మీద పడితే, దాడులు చేసినప్పుడు వాళ్ళు భయపడతారని, ఆ రద్దీలో వారు ఇబ్బంది పడతారని నాకు భయం ఉంది.
ఒకవేళ జరగరానిది ఏమైనా జరిగితే వాళ్ళు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారేమో అనే ఆందోళన నాకుంది. ఆడపిల్లల సేఫ్టీ విషయంలో నాకు ఉన్న ఆ భయమే నా ఇన్ సెక్యూరిటీ" అని శివాజీ వివరణ ఇచ్చారు. ఇక శివాజీని చూస్తుంటే తనకు జాలి వేస్తోంది అని అనసూయ చేసిన కామెంట్స్ పై కూడా ఆయన స్పందించారు. ఽ
"నా మీద జాలి చూపించినందుకు మీకు చాలా థాంక్స్ అమ్మ. మీకు అంత విశాల హృదయం ఉన్నందుకు ధన్యవాదాలు. ఆ భగవంతుడు దయవల్ల మీ రుణం తీర్చుకునే అవకాశాన్ని నాకు త్వరలోనే కల్పించాలని కోరుకుంటున్నాను" అని శివాజీ బదులిచ్చారు.
ఎవరైనా ఆమెను గాని, ఏ మహిళను గాని బయట ఇబ్బంది పెడితే, అది తప్పు అని ఖండించడానికి అందరికంటే ముందు తానే వస్తానని శివాజీ స్పష్టం చేశారు. ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలనే తపన తప్ప, తనకు ఎవరిపైనా ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు.
చివరగా, తాను మాట్లాడిన విషయాల్లో ఆ రెండు అన్ పార్లమెంటరీ పదాలు వాడటం తప్పు కదా అని ఎవరు అడిగినా.. దానికి తాను ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పానని, ఆ మాటల విషయంలో తనదే తప్పు అని ఒప్పుకుంటున్నట్లు శివాజీ మరోసారి స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా నేను ఎలాంటి తప్పు జరిగినా స్పందిస్తానని అన్నారు. ఇక మా అసోసియేషన్ నుంచి మంచు విష్ణు ఫోన్ చేయగానే నేను వెంటనే క్షమాపణ చెబుతూ లేఖ పంపానని అన్నారు.