మోనార్క్ యాటిట్యూడ్‌లో ఇంత మార్పా?
`నేను మోనార్క్‌ని నన్ను ఎవరూ మోసం చేయలేరు` ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే.;
`నేను మోనార్క్‌ని నన్ను ఎవరూ మోసం చేయలేరు` ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఇదే యాటిట్యూడ్‌ని ఒంట బట్టించుకున్న ప్రకాష్ రాజ్ గత కొన్నేళ్లుగా విలక్షణ నటనతో మంచి గుర్తింపుని, అవార్డుల్ని సొంతం చేసుకున్నాడు. అంతే స్థాయిలో నటుడిగా వివాదాల్ని ఎదుర్కొన్నాడు. విమర్శల పాలయ్యాడు. తన బిహేవియర్ కారణంగా ఒక దశలో తెలుగు సినిమాల నుంచి బహిష్కరించినా మారలేదు. అదే యాటిట్యూడ్‌తో వ్యవహరించి చాలా వరకు అవకాశాల్ని పోగొట్టుకున్నాడు.
నటుడిగా తానే మోనార్క్ అని వ్యవహరించే ప్రకాష్ రాజ్‌కు సహ నటీనటులకు థ్యాంక్స్ చెప్పే అలవాటు లేదు. తన పని పూర్తయిందా చెలో ఆ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోవడం మానేస్తాడు. అంత యాటిట్యూడ్ ఉన్న ప్రకాష్ రాజ్ ఉన్నట్టుండి మారిపోవడం, సహ నటీ నటులకు, దర్శకుడికి ప్రత్యేకంగా సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పడం పలువురిని షాక్‌కు గురి చేస్తోంది. ఇతరులకు, సహనటీనటులు, డైరెక్టర్‌లకు థ్యాంక్స్ చెప్పడం అనేది ప్రకాష్ రాజ్ నైజానికి విరుద్ధం.
అలాంటి వ్యక్తి కొత్తగా ప్రవర్తించడం, సహ నటీనటులకు థ్యాంక్స్ చెప్పడంతో ప్రకాష్ రాజ్‌లో ఇంత మార్పా? అని అంతా అవాక్కవుతున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న జక్కన్న ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ స్థాయిలో `వారణాసి` మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ మరో ఎనిమిది నెలలు మాత్రమే ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఊహించని విధంగా ప్రకాష్ రాజ్ వచ్చి చేరాడు. ఈ విషయాన్ని తాజాగా ఆయనే వెల్లడించాడు. ఇలాంటి భారీ మూవీలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నా ప్రకాష్ రాజ్ తొలి సారి తన సహనటీనటులు, డైరెక్టర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. `వారణాసి`అద్భుతమైన షెడ్యూల్ ముగిసింది. నాలో నటుడి ఆకలిసి తీర్చింది.
ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్‌బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలకు థ్యాంక్స్. మీతో కలిసి పని చేయడం ఎంతో ఉత్తేజాన్నిచ్చింది. తర్వాతి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా` అని పేర్కొన్నాడు. గతంలో రాజమౌళి రూపొందించిన `విక్రమార్కుడు` మూవీలో ప్రకాష్ రాజ్ నటించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు జక్కన్న సినిమా చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న `వారణాసి`లో ప్రకాష్ రాజ్ హీరో మహేష్‌కు ఫాదర్‌గా కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని 2027 వేసవిలో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.