మొత్తం అందరికి ఇచ్చి పడేసాడు ... 'ధురంధ‌ర్' డైరెక్ట‌ర్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌!

అంతే కాకుండా ఈ ఏడాది విడుద‌లైన బాలీవుడ్ సినిమాల్లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. ఓటీటీ రైట్స్ విష‌యంలో రికార్డు సొంతం చేసుకుంది.;

Update: 2025-12-24 13:13 GMT

ప్ర‌పంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న సినిమా `ధురంధ‌ర్‌`. ఇటీవలే ప్రేక్ష‌కుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల‌తో పాటు ప్ర‌ముఖుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంటున్న ఈ సినిమాని ఫ‌స్ట్ వీక్ కొంత మంది విర్శించారు. పాకిస్థాన్‌కు వ్య‌తిరేకంగా ఉంద‌ని, క‌ల్పిత స‌న్నివేశాల‌తో ఆ దేశాన్ని విల‌న్‌గా చూపిస్తున్నార‌ని సెక్యుల‌ర్ వాదులు చాలా వ‌ర‌కు ఈ సినిమాపై విమ‌ర్శ‌లు గుప్పించారు. బాలీవుడ్ క్రిటిక్స్‌గా చెప్పుకునే కొంత మంది కూడా విమ‌ర్శ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇదొక ప్రాప‌గండ ఫిల్మ్ అని, ఈ సినిమాకు వ‌స్తున్న‌వ‌న్నీ కార్పొరేట్ బుకింగ్సేన‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా `ధురంధ‌ర్‌`పై విషం క‌క్కారు. సినిమాపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ స్పందించారు. ఒక విధంగా చెప్పాలంటే విమ‌ర్శ‌కుల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. సినిమా విడుద‌లైన మొద‌టి రోజు నుంచే బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. ఇప్ప‌టికీ అదే జోరుని కొన‌సాగిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద ర్యాంపేజ్ చేస్తోంది.

అంతే కాకుండా ఈ ఏడాది విడుద‌లైన బాలీవుడ్ సినిమాల్లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. ఓటీటీ రైట్స్ విష‌యంలో రికార్డు సొంతం చేసుకుంది. రూ.925 కోట్లకు మించి వ‌సూళ్ల‌ని ఇప్ప‌టి వ‌ర‌కు రాబ‌ట్టిన ఈ సినిమా రానున్న రోజుల్లో వెయ్యి కోట్ల మార్కుని దాటేందుకు ప‌రుగులు పెడుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీపై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌పై ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

`ధురంధ‌ర్‌` సాధించిన అత్యుత్త‌మ‌మైన విజ‌యం ఏంటంటే.. ఈ సినిమాకు వ‌చ్చిన ప్ర‌తి టికెట్ ఆర్గానిక్‌గా కొన్న‌దే. ఇడుద‌లైన స‌మ‌యంలో కార్పొరేట్ బుకింగ్స్ అని ఏడ్చిన వారంతా ఇప్పుడు అక‌స్మాత్తుగా మౌనం వ‌హిస్తున్నారు. భార‌తీయ సినీ రంగంలో ఈ సినిమా చిర‌స్థాయిగా నిలిచిపోతుంది. దేశంపై ఉన్న ప్రేమ‌కు `ధురంధ‌ర్‌` నిద‌ర్శ‌నం` అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే `ధురంధ‌ర్ 2` గురించి ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప‌క్కా రియ‌లిస్టిక్ అప్రోచ్‌తో య‌దార్ధ సంఘ‌ట‌న‌ల‌ని, న‌గ్న స‌త్యాల‌ని అంతే న‌గ్నంగా చూపించిన తీరుతో `ధురంధ‌ర్ 2`పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

పార్ట్ 1కు 50 రెట్లు మించి పూర్తి స్థాయిలో హింసాత్మ‌కంగా ఈ సినిమా సాగుతుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న పార్ట్ 2ని మార్చి 19న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌. మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.ప్ర‌ముఖ బాలీవుడ్ విమ‌ర్శ‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ పెట్టారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్త‌యింద‌ని, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రామ‌లు జ‌రుగుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే రూ.900 కోట్ల‌కు పైనే రాబ‌ట్టిన `ధురంధ‌ర్‌` రానున్న రోజుల్లో రూ.1000 కోట్ల మార్కుని దాటుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.


Tags:    

Similar News