'ధురంధ‌ర్ 2'..ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్‌!

వ‌రుస ప‌రాజ‌యాల త‌రువాత ర‌ణ్‌వీర్ సింగ్ న‌టించిన `ధురంధ‌ర్‌` బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తోంది.;

Update: 2025-12-24 10:55 GMT

వ‌రుస ప‌రాజ‌యాల త‌రువాత ర‌ణ్‌వీర్ సింగ్ న‌టించిన `ధురంధ‌ర్‌` బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తోంది. ఆదిత్య‌ధ‌ర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబ‌ర్ మొద‌టి వారంలో విడుద‌లై వ‌ర‌ల్డ్ వైడ్‌గా సంచ‌నాలు సృష్టిస్తోంది. ఓటీటీ డీల్‌లో అత్య‌ధిక మొత్తాన్ని రాబ‌ట్టిన తొలి ఇండియ‌న్ మూవీగా రికార్డుని సొంతం చేసుకుని `పుష్ప 2`పై ఉన్న రికార్డుని చెరిపివేసింది. వ‌సూళ్ల ప‌రంగానూ ప‌లు క్రేజీ సినిమాల‌ని వెన‌క్కి నెట్టిన `ధురంధ‌ర్‌` తాజాగా `బాహుబ‌లి` రికార్డుని సైతం క్రాస్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

సైలెంట్‌గా ఎలాంటి అంచ‌నాలు లేకుడా విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఇప్ప‌టి వ‌ర‌కు రూ..925 క‌ట్లు రాబ‌ట్టి టాప్‌లో నిలిచింది. రానున్న రోజుల్లో వెయ్యి కోట్ల మార్కుని కూడా అవ‌లీల‌గా దాటుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. పాక్‌తో పాటు అర‌బ్ కంట్రీస్‌ల‌లో బ్యాన్‌కు గురైన `ధురంధ‌ర్‌` పాక్‌లో మాత్రం రికార్డులు తిర‌గ‌రాస్తోంది. అక్క‌డ థియేట‌ర్ల‌లో రిలీజ్ కాని `ధురంధ‌ర్‌` పైర‌సీ వెర్ష‌న్ డౌన్‌లోడ్‌ల విష‌యంలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. పాక్‌లో రిలీజ్ కాక‌పోవ‌డంతో అక్క‌డి వారు ఈ మూవీ పైర‌సీ వెర్ష‌న్‌ని ఎగ‌బ‌డి చూస్తున్నారు.

అక్క‌డ బ్యాన్‌కు గురైన ఈ మూవీ పైర‌సీ డౌన్‌లోడ్‌ల ప‌రంగా మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా భారీ చ‌ర్చ‌కు తెర‌లేపిన `ధురంధ‌ర్‌` ద‌క్షిణాది భాష‌ల్లో మాత్రం ఇంత వ‌ర‌కు రిలీజ్ కాలేదు. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ డీల్ భారీ మొత్తానికి క్లోజ్ చేయ‌డంతో మేక‌ర్స్‌ తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ, క‌న్న‌డ వెర్ష‌న్‌ల‌ని రిలీజ్ చేయ‌లేక‌పోయారు. దీంతో తెలుగు వెర్ష‌న్ అయినా రిలీజ్ అయ్యే అవ‌కాశం లేదా అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూశారు.

కానీ అది `ధురంధ‌ర్‌` విష‌యంలో సాధ్యం కాద‌ని, ఓటీటీలో చూసుకోవాల్సిందేన‌ని తేలిపోయింది. ఈ నేప‌థ్యంలోనే `ధురంధ‌ర్ 2` అయినా తెలుగుతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో రిలీజ్ అవుతుందా? అనే చ‌ర్చ మొద‌లైంది. అంతా ఆశ‌గా ఎదురు చూస్తున్న నేప‌థ్యంలో ఈ మూవీ నుంచి గుడ్ న్యూస్ బ‌య‌టికి వ‌చ్చింది. మార్చి 19న `ధురంధ‌ర్ 2` రివేంజ్ పార్ట్ 2 రాబోతోంది. దీన్ని పార్ట్ 1లా కాకుండా పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఇది విడుద‌ల కానుంది.

రిలీజ్ డేట్ విష‌యంలోనూ ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్ లేద‌ని, ముందుగా అనుకున్న‌ట్టుగానే మార్చి 19న పాన్ ఇండియా వైడ్‌గా `ధురంధ‌ర్ 2` రిలీజ్ అవుతుంద‌ని లేటెస్ట్ న్యూస్‌. పార్ట్ 1 ఎండింగ్‌లో రెహ‌మాన్ బ‌లోచ్ క్యారెక్ట‌ర్ ఎండ్ కావ‌డంతో అక్ష‌య్ ఖ‌న్నా క్యారెక్ట‌ర్ ముగుస్తుంద‌ని, దావూద్ ఇబ్ర‌హీం, మ‌సూద్ అజార్‌, ఐఎస్ ఐ ఛీఫ్ క్యారెక్ట‌ర్‌లు మాత్ర‌మే ఉంటాయ‌ని, అందులో బ‌డేసాబ్ క్యారెక్ట‌ర్ హైలైట్ కానుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

Tags:    

Similar News