• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఫోటోషూట్'తో కన్ఫర్మ్...

'ఫోటోషూట్'తో కన్ఫర్మ్ చేసిన స్టార్ హీరో కూతురు

By - Tupaki Desk
Update: 2020-05-16 01:30 GMT
బాలీవుడ్ లో స్టార్ల వారసులు హీరో హీరోయిన్లుగా తెరంగేట్రం చేయడం ఎక్కువైపోతోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరో హీరోయిన్స్ అంతా సినీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చినవారే. ఈ మధ్యే కొత్తతరం హీరోయిన్లుగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, హీరో సైఫ్ కూతురు సారా అలీఖాన్ ఇప్పటికే బాలీవుడ్ లో అడుగు పెట్టేసారు. ఇక తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారాలపట్టి సుహానా ఖాన్ త్వరలో హీరోయిన్ గా మారబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఇక సుహానా హీరోయిన్ కాకముందే సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయిపోతుంది. సెలెబ్రిటీల పిల్లలంటే పార్టీలు, పబ్బులు అంటూ ఫ్రెండ్స్ తో ఎక్కువగా తిరుగుతుంటారు. ఆ విషయంలో సుహానా ఇంకాస్త ఎక్కువగానే ఎంజాయ్ చేస్తుందని చెప్పాలి. 19 ఏళ్ల ఈ కుర్ర భామ తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంటోంది.

ఇక తాజాగా సుహానా ఖాన్‌.. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూనే ఫోటోషూట్‌లు చేస్తుంది. అదేమీ ప్రొఫెష‌న‌ల్ ఫోటోషూట్ కాదులెండి.. కానీ ఆ ఫోటోల‌ను త‌ల్లి గౌరీఖాన్ తీయ‌డం విశేషం. చాలా సింపుల్‌గా ఉన్న సుహానా.. కొన్ని స్టిల్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇక తల్లి గౌరీ ఖాన్ కూడా ఓ ఫ్రొఫెష‌న‌ల్ లాగే ఫీలై త‌న కూతుర్ని కెమెరాలో బంధించింది. ఆ ఫోటోలను సుహానా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. కానీ సుహానా అభిమానులు మాత్రం ఎప్పుడు వెండితెర పై మెరుస్తుందో అని ఆత్రంగా చూస్తున్నారు. ఇక సుహానా ప్ర‌స్తుతం న్యూయార్క్ వ‌ర్సిటీలో యాక్టింగ్ కోర్సు చదువుతుంది. ఏడాది క్రిత‌మే ఆమె ఈ కోర్సులో చేరిందట. ఇదివరకే ఇంగ్లండ్‌లోని అర్డింగ్లీ కాలేజీ నుంచి సుహానా త‌న డిగ్రీ పూర్తి చేసిందట. ఇక యాక్టింగ్ కోర్సు చేస్తుందంటే.. ఖచ్చితంగా సినిమాల్లోకి సుహానా ఎంట్రీ ఇవ్వనుందని ఈ తాజా తల్లి కూతుళ్ల ఫోటో షూట్ తో ఫ్యాన్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనుందో మాత్రం ఇంకా తెలియలేదు.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • Sharukh Khan Daughter 
  • Suhana Khan 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS