సుధీర్ బాబు-ఇంద్రగంటి హ్యాట్రిక్ మూవీ లాంచ్
ఇంద్రగంటితో సుధీర్ బాబు కాంబినేషన్ అంటే క్రేజీ అనే చెప్పాలి. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో రెండు సినిమాలు తెరకెక్కాయి. ఈ కాంబో తొలి మూవీగా `సమ్మోహనం` విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2020లో ఇదే కాంబినేషన్ నుంచి స్టైలిష్ యాక్షన్ మూవీ `వీ` రిలీజైంది. ఈ మూవీ ఆశించిన విజయం అందుకోలేదు.
జయాపజయాల సంగతి ఎలా ఉన్నా.. సుధీర్ బాబు తన కెరీర్ బెస్ట్ రోల్ లో కనిపించారన్న ప్రశంసలు అయితే దక్కాయి. సుధీర్ బాబును ఎంతో స్టైలిష్ గా ఎలివేట్ చేయడంలో ఇంద్రగంటి కి వందశాతం మార్కులు పడ్డాయి. ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు సుధీర్ బాబు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. తన కెరీర్ బెస్ట్ రోల్ లో నటించానని అన్నారు.
తాజాగా ఈ జోడీ హ్యాట్రిక్ మూవీకి సిద్ధమవుతున్నారు. ఈసారి ఇంద్రగంటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించనున్నారు. ఈ హ్యాట్రిక్ చిత్రం కోసం వారిద్దరూ ఎంతో ప్రణాళికా బద్ధంగా పని చేయాలని భావిస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం.. అధికారిక పూజ వేడుకతో సుధీర్ బాబు-ఇంద్రగంటి చిత్రం నేడు (4 జనవరి) ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఉప్పెన ఫేం కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. మహేంద్ర బాబు - కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువ స్వరకర్త వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు.