173 లో పాత్ర ఒక్కటేనా? అంతకు మించి ప్లాన్ చేసారా?
బసిల్ జోసెఫ్ నటుడిగానే కాదు. స్క్రిప్ట్ విషయంలో కూడా మేకర్స్‌కు విలువైన సూచనలు ఇస్తుంటారని పేరుంది.;
మలయాళ చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథలతో మెప్పించే దర్శకుడు బసిల్ జోసెఫ్. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ సినిమాలో నటిస్తున్నారనే వార్త దక్షిణాది వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ప్రచారం వెనుక మరో ఆసక్తికర కోణం కూడా వినిపిస్తోంది. బసిల్ జోసెఫ్‌ను రజనీకాంత్ - కమల్ హాసన్ కేవలం నటుడిగానే చూస్తున్నారా? లేక ఆయన దర్శకత్వ ప్రతిభతో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమ వుతున్నాయి. రజనీకాంత్ 173వ చిత్రానికి కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇది వారిద్దరి మధ్య ఉన్న వృత్తిపరమైన సాన్నిహిత్యాన్ని చాటుతోంది. గతంలోనే రజనీకాంత్ - కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతోందని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దశాబ్దాల తర్వాత ఇద్దరు దిగ్గజాలను ఒకే తెరపై చూపించగల సత్తా ఉన్న దర్శకుడి కోసం అన్వేషణ మరోవైపు సాగుతోంది. `మిన్నల్ మురళి` వంటి చిత్రంతో సూపర్ హీరో జానర్‌ను భారతీయులకు సరికొత్తగా పరిచయం చేసాడు బసిల్ జోసెఫ్. అలాంటి ప్రతిభావంతుడు ఇద్దరు సూపర్ స్టార్లను హ్యాండిల్ చేయడం పెద్ద విషయం కాదు. అందుకే రజనీకాంత్ 173వ సినిమాలో నటుడిగా బసిల్ కు అవకాశం ఇవ్వడం భవిష్యత్తులో రాబోయే మల్టీస్టారర్ కోసం వేసే పునాదికి అవకాశం అయి ఉండొచ్చు.
బసిల్ జోసెఫ్ నటుడిగానే కాదు. స్క్రిప్ట్ విషయంలో కూడా మేకర్స్‌కు విలువైన సూచనలు ఇస్తుంటారని పేరుంది. రజనీకాంత్ 173వ సినిమా షూటింగ్ సెట్స్‌లో బసిల్ ఉండటం ఉంటే? కమల్ - రజనీలు ఆయన పని తీరును దగ్గరుండి గమనించే అవకాశం ఉంటుంది.
ఆయన దర్శకత్వ శైలి - విజన్ ఇద్దరు దిగ్గజాలకు నచ్చితే మెగా మల్టీస్టారర్‌కు బసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది జరిగితే సౌత్ ఇండస్ట్రీలో అరుదైన ఘట్టం అవుతుంది. అలాగే రజనీకాంత్ 173వ చిత్రంలో బసిల్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని సమాచారం. కామెడీ , సహాయ పాత్రకే పరిమితం కాకుండా? కథను మలుపు తిప్పే బలమైన పాత్రలో కనిపించే అవకాశం ఉంది.
కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ప్రతిభా వంతులైన యువ దర్శకులను, నటులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. బసిల్ జోసెఫ్ వంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్‌ను ప్రాజెక్టులోకి తీసుకోవడం వెనుక కమల్ దీర్ఘకాలిక వ్యూహాన్ని కలిగి ఉండొచ్చు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా బసిల్ జోసెప్ టచ్ లో ఉన్నాడు. బన్నీతో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. కేరళ లో ఉండే? బసిల్ అల్లు వారింట ఆహ్వానం కోసం ప్రత్యేకంగా వచ్చాడంటే? దీని వెనుక బలమైన కారణం లేకపోయే అవకాశం లేదు. వెరసీ ఇవన్నీ రజనీ-కమల్ మల్టీస్టారర్ కు దారి తీసే అవకాశాలు బలంగా ఉన్నాయి.