• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుబ్బరాజు ఉక్కిరి...

సుబ్బరాజు ఉక్కిరి బిక్కిరి!

By - Tupaki Desk
Update: 2017-07-21 16:53 GMT
టాలీవుడ్ డ్రగ్ రాకెట్ కేసును విచారిస్తున్న సిట్ బృందం శుక్రవారం క్యారెక్టర్ నటుడు సుబ్బరాజుకు చుక్కలు చూపించినట్లు సమాచారం. తొలి రెండు రోజులు  పూరి జగన్నాథ్.. శ్యామ్ కె.నాయుడులను విచారించిన సిట్ అధికారులు.. మూడో రోజైన శుక్రవారం సుబ్బరాజును విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. మిగతా ఇద్దర్లాగే సుబ్బరాజును కూడా అధికారులు కొంచెం ఎక్కువ సమయమే విచారించారు. దాదాపు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సుబ్బరాజును విచారించినట్లు సమాచారం.

కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ తో సుబ్బరాజుకున్న సంబంధాలపై అధికారులు ఆరా తీశారని.. సుబ్బరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. అధికారుల ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు సుబ్బరాజు ఇబ్బంది పడినట్లుగా సమాచారం. పూరి, శ్యామ్‌ లను వేర్వేరు బృందాలు విచారించగా.. మరో బృందం సుబ్బరాజును ప్రశ్నించింది. సుబ్బరాజు ఉదయం చెప్పిన దానికి.. మధ్యాహ్నం చెప్పిన దానికి సంబంధం లేకపోవడంతో అధికారులకు అతడి తీరు అనుమానాస్పదంగా అనిపించినట్లు సిట్ వర్గాలు చెబుతున్నాయి.!

 ఓ దశలో విచారణ ముగిసి.. సుబ్బరాజు కిందికి దిగుతుండగా మళ్లీ అధికారులు వెనక్కి పిలవగా.. అకున్ సబర్వాల్ రంగంలోకి దిగిన విచారించినట్లు సమాచారం. సిట్ బృందం బ్లడ్ శాంపిల్‌ ను కూడా సేకరించింది. విచారణకు అందరూ సహకరిస్తున్నారని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. శనివారం నటుడు తరుణ్ విచారణకు హాజరు కానున్నారని తెలిపారు.
Tags:    
  • Subbaraju 
  • Exsice SIT Inquiry 
  • Drugs Case 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS