తన పర్సనల్ అసిస్టెంట్ బర్త్ డే సెలెబ్రేట్ చేసిన బన్నీ...!

Update: 2020-04-15 05:50 GMT
తమ అభిమాన హీరోల బర్త్ డే వచ్చింది అంటే ఫ్యాన్స్ ఎంత సందడి చేస్తారో అందరికి తెలిసిన విషయమే. తమ అభిమాన హీరోల బర్త్ డే కి పెద్ద పెద్ద కటౌట్లు..బ్యానర్లు.. ప్లెక్సీలు.. కేక్ కట్టింగ్ లు అంటూ హడావిడి బాగానే ఉంటుంది. తమ ఫేవరెట్ హీరో ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని అభిమానులు హీరోల కటౌట్లు ముందు బర్త్ డే వేడుకలు జరుపుతూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే హీరోల పుట్టిన రోజులను అభిమానులు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు నిర్వహించడం కామన్. కానీ ఒక హీరో దగ్గర పనిచేసే అసిస్టెంట్ పుట్టిన రోజును హీరో సెలబ్రేట్ చేయడం చాలా అరుదుగా జరిగే సంఘటన. అలాంటి బర్త్ డే సెలబ్రేషన్ ఇప్పుడు ఇక్కడ జరిగింది. ఆ హీరో మరెవరో కాదు... టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

కొంతమంది స్టార్ హీరోలు ఎంత రేంజ్ కి పోయినా ఒదిగి ఉండటం అలవాటు చేసుకుంటుంటారు... వారిలో బన్నీ ఒకడని చెప్పుకోవచ్చు. ఇటీవలే తన కుమారుడు అల్లు అయాన్ బర్త్ డేను.. తర్వాత తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్న అల్లు అర్జున్ లేటెస్టుగా తన దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసే వ్యక్తి పుట్టిన రోజుని కూడా సెలెబ్రేట్ చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. తన అసిస్టెంట్ శివ బర్త్ డే సందర్భంగా తనయుడు అయాన్ చేతుల మీదుగా తన పర్సనల్ అసిస్టెంట్ కి కేక్ కటింగ్ చేపించాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

ఈ ఫొటోలో కేక్ చూస్తుంటే హోమ్ మేడ్ కేక్ అని అర్థం అవుతుంది. తన అసిస్టెంట్ పుట్టిన రోజు కోసం బన్నీ స్వయంగా తన ఇంట్లోనే కేక్ తయారు చేపించి అతని బర్త్ డే సెలెబ్రేట్ చేయడం గ్రేట్ అంటున్నారు ఇది తెలిసిన వాళ్ళు. ఈ విషయం తెలిసిన బన్నీ అభిమానులు చాలా ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో మంచి మనసు గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఏదేమైనా తన దగ్గర పని చేసే అసిస్టెంట్ బర్త్ డేకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి స్వయంగా తనే కేక్ కటింగ్ చేపించి అతన్ని సంతోష పరచడం నిజంగా చాలా గొప్ప విషయమని అందరూ బన్నీని అభినందిస్తున్నారు.
Tags:    

Similar News