• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాస్ రాజా 'ఖిలాడి' కోసం...

మాస్ రాజా 'ఖిలాడి' కోసం దిగిరానున్న కేజీఎఫ్ స్టార్స్..!!

By - Tupaki Desk
Update: 2020-12-23 08:31 GMT
సౌత్ ఇండియన్ కేజీఎఫ్ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి భారీ హిట్ నమోదు చేసిందో అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా దర్శక నిర్మాతలు, హీరో యష్ లతో పాటు ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరిని స్టార్ చేసింది కేజీఎఫ్. అలా కేజీఎఫ్ తో సూపర్ స్టార్స్ అయ్యారు ఫైట్ మాస్టర్స్ అన్బు-అరివు. కేజీఎఫ్ సినిమాలోని ఫైట్స్, హీరో ఎలివేషన్స్ ఓ రేంజిలో ఉన్నాయంటే దానికి కారణం వీరిద్దరే. అయితే వీరిద్దరూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోలందరి సినిమాలకు ఫైట్స్ డిజైన్ చేస్తున్నారు. తాజాగా అన్బు-అరివు తెలుగులో తెరకెక్కనున్న ఓ భారీ సినిమాకి పని చేయనున్నట్లు తెలుస్తుంది.

మాస్ మహారాజ్ రవితేజ.. డిస్కోరాజా ప్లాప్ తర్వాత ఏ మాత్రం నిరుత్సాహపడకుండా సినిమాల వరుసగా లైన్లో పెడుతున్నాడు. అందులో ఒకటి ఖిలాడి. రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను ఓ భారీ యాక్షన్ సినిమాగా రూపొందించే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. అయితే యాక్షన్ ఫిల్మ్ కాబట్టి ఇప్పటికే ఈ సినిమాకోసం భారీ జైలు సెట్ కూడా వేశారు. అక్కడే మెయిన్ యాక్షన్ పార్ట్, ఫైట్స్ షూట్ చేస్తారట. అయితే ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ లను ఓకే చేసినప్పటికి.. యాక్షన్ సీన్స్, ఫైట్స్ సన్నివేశాలను తారాస్థాయికి తీసుకెళ్లడానికి అన్బు-అరివు లను ఆన్ బోర్డు చేసినట్లు సమాచారం. ఇక వీరు రూపొందించబోయే ఫైట్స్, యాక్షన్ పార్ట్ సినిమాకే హైలైట్ కానుందని టాక్. రవితేజ డ్యూయెల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చనున్నాడు.
Tags:    
  • Khiladi 
  • Raviteja 
  • Stunt Master 
  • Anbu 
  • Arivu 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS