క్లిక్ క్లిక్ : సోషల్ డిస్టెన్స్ తో హాట్ బ్యూటీ ఫొటో షూట్
స్టార్ హీరోయిన్స్ నుండి ఒక మోస్తరు నటి వరకు ఎప్పుడూ ఏదో ఒక ఫొటో షూట్ తో బిజీగా ఉండేవారు. కరోనా కారణంగా వారాల తరబడి సెలబ్రెటీలు కెమెరా ముందుకు వచ్చిన దాఖలాలే లేవు. కొందరు తమ ఫోన్స్ లో సెల్ఫీలు తీసుకుని లేదంటే ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాని ఫొటో షూట్స్ మాత్రం లేవు. సామాజిక దూరం పాటించాలంటూ పదే పదే ప్రభుత్వాలు వైధ్యులు చెబుతున్న కారణంగా ఫొటో షూట్స్ అనేది సాధ్యం అవ్వడం లేదు.
ఆండ్రియా మాత్రం విభిన్నంగా ఫొటో షూట్ కు ఫోజ్ ఇచ్చింది. సామాజిక దూరం పాటిస్తూ ఆండ్రియా ఫొటో షూట్ స్టిల్స్ ఇచ్చింది. ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్ సుందర్ రాము ఈ ఫొటో షూట్ ను నిర్వహించాడు. ఆండ్రియా ఇంటి పక్కన ఉండే అతడు ఈ స్టిల్స్ ను తీసినట్లుగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆండ్రియా కిటికి పక్కన ఉండి ఫొటోలకు ఫోజులు ఇవ్వగా సుందర్ రాము తీశారు.
సోషల్ మీడియాలో పక్కింటి అమ్మాయి ఫొటో షూట్ అంటూ ట్యాగ్ పెట్టి ఈ ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ ఫొటో షూట్ స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కెమెరాకు దూరంగా ఉన్న హీరోయిన్స్ ఇకపై ఇలా సామాజిక దూరం పాటిస్తూ ఫొటో షూట్స్‌కు రెడీ అవుతారేమో. ఆండ్రియా తెలుగుతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో తెలుగులో లేకున్నా తమిళం లో మాత్రం ఈ అమ్మడు చాలా బిజీగా ఉంది.