భాగ్యశ్రీ బోర్సే.. యూత్ ప‌డి చ‌స్తున్నారంటే!

గ్లామర్ ప్రపంచంలో కేవలం అందం మాత్రమే ఉంటే సరిపోదు.. ఆ అందానికి అభినయం తోడైనప్పుడే అసలైన గుర్తింపు లభిస్తుంది;

Update: 2026-04-18 04:17 GMT

గ్లామర్ ప్రపంచంలో కేవలం అందం మాత్రమే ఉంటే సరిపోదు.. ఆ అందానికి అభినయం తోడైనప్పుడే అసలైన గుర్తింపు లభిస్తుంది. ఈ సూత్రాన్ని అక్షరాలా నిజం చేస్తోంది యువ నటి భాగ్యశ్రీ బోర్సే. చారెడేసి కళ్లతో మంత్రముగ్ధులను చేసే చూపులతో మాయ చేయగల ప్రతిభ ఈ యువ‌న‌టి సొంతం. కృత్రిమమైన హంగుల కంటే, క్యూట్‌గా, నేచురల్‌గా కనిపించే భాగ్యం శైలికి తెలుగు యువత ఫిదా అవుతోంది. అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ భామ పేరే వినిపిస్తూ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది.

మాస్ డైరెక్ట‌ర్ హరీష్ శంకర్ రూపొందించిన`మిస్టర్ బచ్చన్` వంటి భారీ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ తన మొదటి ప్రయత్నంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన నటించి తన అద్భుత నటనతో అలరించింది. ఆ సమయంలోనే వీరిద్దరి కెమిస్ట్రీ చూసి రామ్ సైతం ఈ బ్యూటీకి పడిపోయాడనే ప్రచారం జరుగుతోంది. వృత్తిపరంగా ఇద్దరూ తమ తమ దారుల్లో దూసుకుపోతున్నారు. వరుస అవకాశాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇండస్ట్రీలో ఏర్పరచుకుంటోంది.

భాగ్యశ్రీ సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తుంటే త‌న‌ రేంజ్ ఏంటో అర్థమవుతుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ప్రతి పోస్ట్ నిమిషాల వ్యవధిలోనే వేల సంఖ్యలో లైకులు, కామెంట్లతో వైరల్ అవుతోంది. కేవలం ఫోటోలు మాత్రమే కాకుండా, త‌న‌ డ్రెస్సింగ్ సెన్స్, మేకప్ శైలి కూడా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అతిగా కాకుండా చాలా నేచురల్‌గా ఉంటూనే ఎంతో ఆకర్షణీయంగా కనిపించే తీరు నేటి తరం హీరోయిన్లలో ఒక సోషల్ మీడియా క్వీన్ గా నిలబెట్టింది.

ప్రస్తుతం ఈ భామ అక్కినేని అఖిల్ సరసన నటిస్తున్న `లెనిన్` చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన సింగిల్ సాంగ్‌లో భాగ్యశ్రీ తన అందచందాలతో అభిమానుల మతులు చెడగొడుతోంది. అందానికి మించి త‌న అద్భుత‌మైన ఆహార్యం, డ్యాన్సుల‌తో హృద‌యాల‌ను గిల్లుతోంది. అఖిల్ - భాగ్యశ్రీల జోడీ తెరపై ఎంతో ఫ్రెష్‌గా ఉండటంతో ఈ సినిమా త‌న‌ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంలోని భాగ్య‌శ్రీ‌ లుక్ చూసి టాలీవుడ్ మేకర్స్ మరోసారి అవ‌కాశాలివ్వ‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ సాగుతోంది.

భాగ్యశ్రీ గ్లామర్- టాలెంట్ చూస్తుంటే భవిష్యత్తులో టాలీవుడ్‌లో మరిన్ని భారీ ప్రాజెక్టులలో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్ర‌భాస్, అల్లు అర్జున్, మ‌హేష్, చ‌ర‌ణ్‌ లాంటి పాన్ ఇండియా స్టార్ల‌ సరసన మునుముందు న‌టించేందుకు ఆస్కారం ఉంది. కేవలం ఒక గ్లామర్ డాళ్‌గా మాత్రమే కాకుండా.. వైవిధ్యమైన పాత్రలతో తన నటనను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్న ఈ నేచురల్ బ్యూటీ అగ్ర న‌టీమ‌ణుల జాబితాలో చేరుతుంద‌నే ఫ్యాన్స్ ఊహిస్తున్నారు.

Tags:    

Similar News