వ‌య‌సుకు, క్రేజ్‌కు మించి సినిమాలు చేస్తున్నాడా?

`బాహుబ‌లి` సిరీస్ పాన్ ఇండియా సినిమాల‌కు, టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, సాండ‌ల్ వుడ్ ఇండ‌స్ట్రీల‌తో భారీ బ‌డ్జెట్ మూవీస్‌కి ఆజ్యం పోసిన విష‌యం తెలిసిందే.;

Update: 2026-04-17 18:30 GMT

`బాహుబ‌లి` సిరీస్ పాన్ ఇండియా సినిమాల‌కు, టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, సాండ‌ల్ వుడ్ ఇండ‌స్ట్రీల‌తో భారీ బ‌డ్జెట్ మూవీస్‌కి ఆజ్యం పోసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో మ‌న సినిమాల‌కు జ‌రుగుతున్న బిజినెస్‌ని దృష్టిలో పెట్టుకుని ప్ర‌తి హీరో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల వెంట ప‌రుగులు పెడుతున్నాడు. ఇండ‌స్ట్రీలో ఏ హీరోని క‌దిలించినా వినిపిస్తున్న మాట పాన్ ఇండియా. అది చేయ‌క‌పోతే ఏదో వెన‌క‌బ‌టులో ఉన్నామ‌నే ఫీలింగ్ ప్ర‌తి ఒక్క‌రిలోనూ క‌నిపిస్తోంది.

అంత‌గా పాన్ ఇండియా సినిమాల‌కు మ‌న హీరోలు అడిక్ట్ అయిపోయారు. దీనికి పెద్ద కార‌ణ‌మే ఉంది. భారీ స్థాయి సినిమాలు చేస్తే అదృష్టం బాగుండి అది ఆడితే హీరోగా స్టేచ‌ర్ పెరుగుతుంది..మార్కెట్ కూడా బ‌ల‌ప‌డుతుంది. ఈ రెండు విష‌యాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప్ర‌తి హీరో ఇప్పుడు పాన్ ఇండియా జ‌పం చేస్తూ దాని వెంట ప‌రుగులు తీస్తున్నాడు. అయితే కొంత మంది మాత్రం వ‌య‌సుకు మించిన క‌థల్ని, సినిమాల్ని ఎంచుకుంటూ ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి వెళుతున్నారు అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.

ఇందుకు ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌గా ఓ యంగ్ హీరో గురించి చెబుతున్నారు. స‌ద‌రు యంగ్ హీరో త‌న వ‌య‌సుకు, క్రేజ్‌కు మించిన క‌థ‌ల‌తో సినిమాలు చేస్తున్నాడా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. పేరున్న భారీ స్టార్స్ చేయాల్సిన క‌థ‌ల‌ని యంగ్ హీరో ఎంచుకుంటున్నాడ‌ని ఇటీవ‌ల ఆయ‌న చేస్తున్న సినిమాల‌ని బ‌ట్టి చూస్తే అర్థ‌మ‌వుతోంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చారిత్ర‌క నేప‌థ్యంలో రూపొందుతున్న ఫాంట‌సీ మూవీ అని అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు.

లెజెండ‌రీ వారియ‌ర్ స్టోరీ నేప‌థ్యంలో రూపొందుతున్న సినిమా ఇది. 985 కాలం నేప‌థ్యంలో సాగే క‌థ‌ని తీసుకుని సెంగోల్ ని ర‌క్షించే యోధుడిగా ఇందులో యంగ్ హీరోని చూపించారు. ఈ సినిమా కోసం త‌ను కూడా బాగానే క‌ష్ట‌ప‌డినా ఎందుకో యాప్ట్ కాలేద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి క‌థ‌ల్ని భారీ స్టార్‌డ‌మ్ ఉన్న న‌టులు చేస్తే దానికి వ‌చ్చే మైలేజ్ వేరే స్థాయిలో ఉంటుంద‌ని చెబుతున్నారు. అంతే కాకుండా గ్రాఫిక్స్‌కి బాగా స్కోప్ ఉన్న సినిమా ఇది. గ్రాఫిక్స్ కోసం టీమ్ చాలా క‌ష్ట‌ప‌డింది. గ్రాఫిక్స్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న వేళ దీనికి సంబంధించిన గ్రాఫిక్స్ వ‌ర్క్‌ని మేక‌ర్స్ మార్చి మార్చి వ‌ర్క్ చేశారు.

అయినా స‌రే ఆ లోటు క‌నిపిస్తూనే ఉంద‌ని, యంగ్ హీరో కాకుండా స్టార్ స్టేట‌స్ ఉన్న హీరో చేసి ఉంటే సినిమాపై ఉన్న క్రేజ్ మ‌రింత రెట్టింప‌య్యేద‌ని, ఈ విష‌యంలో మేక‌ర్స్ తొంద‌ర ప‌డ్డార‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొన్ని నెల‌లుగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ యంగ్ హీరో మూవీ త్వ‌ర‌లోనే పాన్ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. కంటెంట్‌తో విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతుందా? ..లేక విమ‌ర్శ‌ల‌నే నిజం చేస్తుందా? అన్ని వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News