ప్ర‌భాస్ త‌ర్వాత ఈ హీరో ఒక్క‌డికే ఆ ఛాన్స్!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ తర్వాత ఆ స్థాయి భారీ ప్రాజెక్టులతో.. పక్కా ప్రణాళికతో దూసుకుపోతున్న ఏకైక హీరోగా రణబీర్ కపూర్ నిలుస్తున్నారు.;

Update: 2026-04-17 19:30 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ తర్వాత ఆ స్థాయి భారీ ప్రాజెక్టులతో.. పక్కా ప్రణాళికతో దూసుకుపోతున్న ఏకైక హీరోగా రణబీర్ కపూర్ నిలుస్తున్నారు. రణబీర్ ప్రస్తుతం నటిస్తున్న ఐదు చిత్రాలను పరిశీలిస్తే..ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా అత్యంత వైవిధ్య‌మైన కంటెంట్ తో రూపొందుతున్నాయి. నటుడిగా తనలోని భిన్న కోణాలను ఆవిష్కరించుకునేందుకు అత‌డు సిద్ధమవుతున్న తీరు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తున్న `లవ్ అండ్ వార్` చిత్రంలో రణబీర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారనే వార్త సినిమాపై అంచనాలను పెంచేసింది.

మరోవైపు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న `రామాయణం` చిత్రం ఇందుకు పూర్తి భిన్నమైనది. ఇందులో రణబీర్ పరమ పవిత్రమైన, ఆదర్శవంతమైన శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి రామాయణం మొదటి భాగం.. వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగం విడుదల కానున్నాయి. విశేషం ఏమిటంటే.. ఈ రెండు ఆధ్యాత్మిక చిత్రాల మధ్యలో జనవరి చివరి వారంలో నెగెటివ్ షేడ్ ఉన్న `లవ్ అండ్ వార్` విడుదల కానుంది. ఒకే సమయంలో ఆదర్శప్రాయమైన దైవ సమానమైన పాత్రలోనూ... రాక్షస ప్రవృత్తి ఉన్న పాత్రలోనూ కనిపించడం రణబీర్ తీసుకున్న అతిపెద్ద సవాలుగా భావించవచ్చు.

కేవలం ఇవే కాకుండా.. రణబీర్ తదుపరి చిత్రాల ఎంపిక కూడా ఉత్కంఠను కలిగిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న `యానిమల్ పార్క్` (యానిమల్ సీక్వెల్) 2028లో విడుదల కానుంది. ఇది ఒక పక్కా సోషల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను రక్తి కట్టించనుంది. ఆ తర్వాత సోషియో-ఫాంటసీ జోనర్‌లో `బ్రహ్మాస్త్ర పార్ట్ 2స‌` రాబోతోంది. ఇలా వరుసగా ఐదు చిత్రాల్లో ఐదు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలను పోషిస్తూ.. రణబీర్ తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే తరం ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించడమే అత‌డి లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే ఒక పాత్రలో శ్రీరాముడిగా చూసిన ప్రేక్షకులే.. మరో సినిమాలో మ‌రో పాత్రలో నెగెటివ్ షేడ్స్‌లో చూడగలరా? అనే సందేహాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. పరిణతి చెందని ఒక సెక్ష‌న్ రాముడిగా చూసిన తర్వాత అత‌డిని రాక్షసుడిగా చూడలేమని వాదిస్తున్నా.. మెజారిటీ సినీ విశ్లేషకులు మాత్రం నటుడు ఎల్ల‌పుడూ అన్ని రకాల పాత్రల్లోనూ మెప్పించాలని అభిప్రాయపడుతున్నారు. పాత్రకు, నటుడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకునే స్థాయికి నేటి ప్రేక్షకులు చేరుకున్నారని విశ్లేషిస్తున్నారు. రణబీర్ ప్ర‌తి ఎంపికా అత‌డిలోని నటనా వైవిధ్యాన్ని నిరూపించడానికి ఒక గొప్ప వేదిక.

ఈ క్రమంలో రణబీర్ కపూర్ భారతీయ దిగ్గజ నటుల బాటలో నడుస్తున్నారని చెప్పవచ్చు. గతంలో నవరస నటసార్వభౌముడు ఎన్టీఆర్ వంటి వారు ఒకే సినిమాలో హీరోగానూ, విలన్‌గానూ నటించి మెప్పించారు. ఒకే చిత్రంంలో నాలుగైదు పాత్ర‌ల్లో న‌టించిన ఘ‌న‌త లెజెండ‌రీ ఎన్టీఆర్ కి ఉంది. జానపద, పౌరాణిక చిత్రాల్లో రాముడిగా అలరించి, అదే సమయంలో రావణుడిగా, దుర్యోధనుడిగాను అదరగొట్టిన ఘనత అన్నగారిది. నేటితరం హీరోలు కూడా అదే స్ఫూర్తితో అన్ని రకాల పాత్రలను పోషించి బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాల్సి ఉంటుంది. రణబీర్ కపూర్ ఎంచుకున్న ఈ మార్గం అత‌డిని భారతీయ చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ కాంపిటీట‌ర్‌గా నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News