స్టార్ హీరో మూవీ రిలీజ్ వాయిదా!
దేశవ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తుండడంతో.. అన్ని సినీ ఇండస్ట్రీల్లోనూ సినిమాలను వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో పెద్ద సినిమాల నుంచి చిన్న మూవీస్ వరకూ అన్నీ వెనక్కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. సౌత్ తోపాటు బాలీవుడ్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఇప్పటికే పలు చిత్రాలను వాయిదా వేశారు. తాజాగా.. స్టార్ హీరో జాన్ అబ్రహం 'సత్యమేవ జయతే-2' సైతం పోస్ట్ పోన్ జాబితాలోకి వెళ్లిపోయింది.
టీ-సిరీస్, ఎమ్మాయ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని మిలాప్ జవేరి తెరకెక్కించారు. దివ్య ఖోస్లా కుమార్ హీరోయిన్. ఈ చిత్రానికి మే 13న స్లాట్ బుక్ చేసింది యూనిట్. కానీ.. కరోనా ఉధృతి రోజురోజుకూ పెరిగిపోతుండడంతో అనివార్యంగా వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కొత్త తేదీని తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.
రోజుకు 3 లక్షల పైచిలుకు కేసులు నమోదవుతున్న ఈ తరుణంలో సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయలేకపోతున్నారు. పెద్ద సినిమాలన్నీ ఓపెనింగ్స్ పైనే దృష్టిపెడతాయన్న సంగతి తెలిసిందే. కరోనా మహోగ్ర రూపమై విజృంభిస్తున్న ఈ తరుణంలో జనాలు సినిమా థియేటర్ల వైపు వచ్చే అవకాశం చాలా స్వల్పం. అందుకే నిర్మాతలు వాయిదాకే మొగ్గు చూపుతున్నారు.
అయితే.. టాప్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘రాధే' మాత్రం రిలీజ్ కే మొగ్గు చూపుతుండడం విశేషం. రంజాన్ పర్వదినాన్ని టార్గెట్ గా చేసుకుని ఎప్పుడో ఈ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. మే 13నే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే.. ఈ చిత్రంతో మేకర్స్ కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఇటు థియేటర్లో, అటు ఓటీటీలో ఒకేసారి ‘రాధే'ను రిలీజ్ చేస్తున్నారు. మరి, ఈ ఫలితం ఎలా ఉంటుందన్నది చూడాలి.