2025 రివ్యూ : ఓటీటీల్లో అదే టాప్‌!

ఇండియాలో ఓటీటీ అనగానే ఎక్కువ శాతం వినిపించే పేర్లు నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, జియో హాట్‌ స్టార్‌. ఇవి కాకుండా చిన్నా చితకా చాలా ఓటీటీలు ఉన్నాయి.;

Update: 2025-12-31 12:30 GMT

ఇండియాలో ఓటీటీ మార్కెట్‌ విపరీతంగా పెరిగింది. గడిచిన ఐదేళ్ల కాలంలో ఓటీటీ ఏడాది ఏడాదికి పెరుగుతూ వచ్చింది. సబ్‌స్క్రిప్షన్‌ రేటు పెంచినప్పటికీ ఖాతాదారుల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ఇండియాలో ఓటీటీ అనగానే ఎక్కువ శాతం వినిపించే పేర్లు నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, జియో హాట్‌ స్టార్‌. ఇవి కాకుండా చిన్నా చితకా చాలా ఓటీటీలు ఉన్నాయి. అయితే సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు ఈ మూడింటిలోనే ఎక్కువగా స్ట్రీమింగ్‌ కావడంతో మార్కెట్‌ లో మెజార్టీ శాతం ఈ మూడు ఓటీటీలదే అనడంలో సందేహం లేదు. ఇతర ఓటీటీలు సైతం ఏదో ఒక వెబ్‌ సిరీస్ లేదా సినిమా వల్ల కొన్ని వారాల పాటు వార్తల్లో నిలవడం, ఖాతాదారులను పెంచుకోవడం జరుగుతూ వచ్చింది. అయితే 2025 లో ఏ ఓటీటీని ఎక్కువ మంది చూశారు అనే విషయంలో ఈ మూడు ఓటీటీల నుంచి ఒకటి ఉంటుంది, అది గత నాలుగు అయిదు ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌ లో వరుస సినిమాలు...

సాధారణంగా టాప్‌ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ కనుక అత్యధికులు ఆ ఓటీటీని చూసి ఉంటారు అని అంతా భావిస్తూ ఉంటారు. కానీ నెట్‌ఫ్లిక్స్‌ లో ఎక్కువగా ఇంగ్లీష్ కంటెంట్‌ ఉంటున్న కారణంగా ఇండియన్‌ ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గర కావడం లేదు అనేది గతంలో ఆరోపణ. అయితే ఈ మధ్య కాలంలో మెజార్టీ పెద్ద సినిమాలు, మంచి కంటెంట్‌ ఉన్న చిన్న సినిమాలను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేస్తోంది. దాంతో ఇండియన్‌ ఓటీటీ మార్కెట్‌లో నెట్‌ఫ్లిక్స్ టాప్‌ లో ఉంది అనడంలో సందేహం లేదు. అయితే అమెజాన్‌ ప్రైమ్‌ సైతం ఈ పోటీలో తక్కువ ఏం కాదని చెప్పాలి. సినిమాలను కొనుగోలు చేసే విషయంలో నెట్‌ఫ్లిక్స్‌ తో పోల్చితే కాస్త వెనుక ఉన్నప్పటికీ తన ఒరిజినల్స్ తో అమెజాన్‌ ప్రైమ్‌ ముందు నిల్చుంటుంది. ప్రైమ్‌ వీడియో నుంచి వచ్చే వెబ్‌ సిరీస్‌ లు ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ప్రతి ఏడాది కొత్త సీజన్‌లతో పాత వెబ్‌ సిరీస్‌ లు టాప్‌ వ్యూవర్‌షిప్‌ను దక్కించుకుంటు ఉన్న విషయం తెల్సిందే. అందుకే 2025 టాప్‌ వ్యూవర్‌షిప్‌ దక్కించుకున్న ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో నిలిచింది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో వెబ్‌ సిరీస్‌లు..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో 2025 లో పలు సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌లకు కొత్త సీజన్‌లను, కొనసాగింపు కార్యక్రమాలను తీసుకు వచ్చింది. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్న ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ కి కొత్త సీజన్‌ ను తీసుకు వచ్చింది. గతంలో మాదిరిగానే ఫ్యామిలీ మ్యాన్‌ కి మంచి స్పందన దక్కింది. ఇంతకు ముందు సీజన్‌లతో పోల్చితే కాస్త జోష్ తగ్గిందని కొందరు రివ్యూలు ఇచ్చినా ఓవరాల్‌గా వెబ్‌ సిరీస్‌ కి మంచి వ్యూస్ ను దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. ఇక విలేజ్‌ డ్రామా పంచాయత్‌ సైతం కొత్త సీజన్‌తో వచ్చింది. సీజన్‌ 3 కి వచ్చిన అనూహ్య స్పందన నేపథ్యంలో ఈ ఏడాది సీజన్‌ 4ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. పంచాయత్‌ 4 ను సైతం అత్యధికులు చూశారు. ఇదే క్రమంలో పాటల్ లోక్‌ సీజన్ 2 వచ్చింది. ముందు ముందు పాటల్ లోక్‌ కి మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని సీజన్‌ 2 ను చూస్తే అర్థం అవుతోంది.

జియో హాట్‌ స్టార్‌లో సినిమాలు..

మొత్తానికి ప్రైమ్‌ వీడియోను టాప్‌ వ్యూవర్‌షిప్‌ లో వెబ్‌ సిరీస్‌లు నిలిపాయి అనుకోవచ్చు. కేవలం వెబ్‌ సిరీస్‌లు మాత్రమే కాకుండా పలు బాలీవుడ్‌ సినిమాలను, సౌత్‌, ఇంగ్లీష్ సినిమాలను ప్రైమ్‌ వీడియో అందించింది. అందులో చాలా సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే అమెజాన్‌ ప్రైమ్‌ నెం.1 స్థానంలో నిలిచింది. మరో వైపు నెట్‌ఫ్లిక్స్ సైతం భారీ వ్యూస్‌ ను దక్కించుకుంది. ముఖ్యంగా సినిమాలతో నెట్‌ఫ్లిక్స్ అత్యధిక వ్యూస్ ను రాబట్టింది. సినిమాల వ్యూస్‌ పరంగా చూస్తే ఖచ్చితంగా నెట్‌ఫ్లిక్స్‌ నెం.1 అనడంలో ఎలాంటి అనుమానం లేదు అనేది విశ్లేషకుల మాట. ఇక స్పోర్ట్స్‌ కంటెంట్‌ ఇతర వెబ్‌ సిరీస్‌, సినిమాల కారణంగా జియో హాట్‌ స్టార్‌ సైతం ఈ సారి టాప్‌ వ్యూవర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. పైగా జియో వారు ఈ ఓటీటీని తీసుకున్న కారణంగా ప్రేక్షకుల నుంచి మరింతగా స్పందన దక్కింది, కంటెంట్‌ క్వాలిటీ విషయంలోనూ మరింత జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News