ప్రేమలో పడ్డ నవీన్ పోలిశెట్టి.. ఆ అమ్మాయి ఎవరంటే?

ఇకపోతే ఎలాంటి భార్య రావాలని కోరుకుంటున్నారు అని ప్రశ్నించగా.. ఆ అమ్మాయికి ఉండాల్సిన మొదటి లక్షణం నన్ను ఎటువంటి ప్రశ్నలు అడగకూడదు.;

Update: 2025-12-31 10:17 GMT

సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వారికి సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మాత్రం క్షణాల్లో వైరల్ అవుతాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా వారు పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకపోయినా.. ఎవరైనా అమ్మాయితో కనిపించినా.. ఇట్టే ఎఫైర్ రూమర్స్ దావానంలా పాకిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి సంబంధించిన ఒక వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత కొన్ని రోజులుగా నవీన్ పోలిశెట్టి పెళ్లి ఎప్పుడు అంటూ అభిమానులు, నెటిజన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడప్పుడు ఈ ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేసిన నవీన్ పోలిశెట్టి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. విషయంలోకి వెళ్తే తాజాగా ఈయన మూడు వరుస విజయాల తర్వాత అనగనగా ఒక రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా రాజుగారి పెళ్లి వేడుక అంటూ ఒక ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో భాగంగానే మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పిన ఈయన.. తనకు ఎలాంటి అమ్మాయి భార్యగా రావాలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ముందుగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని ప్రశ్నించగా ప్రభాస్ పెళ్లి చేసుకున్న మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నేను పెళ్లి చేసుకుంటానని చమత్కరించిన నవీన్ పోలిశెట్టి.. తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. నాకు సినిమాలలోనే పెళ్లి చేసుకోవాలని రాసి పెట్టినట్లుంది. మీరు ఇలాగే నా సినిమాలను ఆదరిస్తూ ఉంటే.. నా ప్రతి సినిమాలో కూడా పెళ్లి సీను ఉండేలా చూస్తాను అంటూ కామెంట్లు చేశారు.

ఇకపోతే ఎలాంటి భార్య రావాలని కోరుకుంటున్నారు అని ప్రశ్నించగా.. ఆ అమ్మాయికి ఉండాల్సిన మొదటి లక్షణం నన్ను ఎటువంటి ప్రశ్నలు అడగకూడదు. ఇక తాను ఎలా ఉన్నా సరే ఆమెకు తగ్గట్టుగా ఆ అమ్మాయి కోసం నన్ను నేను మార్చుకుంటాను అంటూ తెలిపారు. ఇక ఇదే సమయంలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న అందరిలో అనుమానాలు రేకెత్తించింది. ప్రస్తుతం తన తల్లిదండ్రులు పెళ్లికూతురు కోసం వెతుకుతున్నారని కానీ ఇంకా అమ్మాయి దొరకలేదని నవీన్ తెలిపారు. కానీ ఒక జర్నలిస్టు మాత్రం ఆయనను ఆట పట్టిస్తూ.. అమెరికాలో నీకోసం వధువుని వెతుకుతానని తెలిపారు. ఇక ఈయన మాటలను బట్టి చూస్తే ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ఒక తెలుగు అమ్మాయితో నవీన్ డేటింగ్ చేస్తున్నాడని.. ఆయన ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేశారు.

గత ఏడాది ఆక్సిడెంట్ కి గురైన సమయంలో కూడా అమెరికాలోనే ఉన్నారు నవీన్ పోలిశెట్టి. అక్కడే కథలు వింటున్నానని కూడా చెప్పాడు. ఇక అదే సమయంలోనే ఆయన ప్రేమలో పడ్డారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Tags:    

Similar News