రెస్పాన్సిబులిటీ అనేది యాక్టర్స్ వరకు మాత్రమేనా?
అయితే ఈ వివాదంపై తాజాగా నటుడు నవదీప్ స్పందించాడు. 'దండోరా' సినిమా ప్రచారంలో భాగంగా చిత్రబృందం కాలేజీ స్టూడెంట్స్‌తో చిట్‌చాట్ నిర్వహించింది.;
కొన్నేళ్ల విరామం తరువాత నటుడు శివాజీ తన సెకండ్ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆయన మలి ప్రయత్నంలో భాగంగా చేసిన వెబ్ సిరీస్ '#90'స్' సూపర్ హిట్ కావడం.. మంగపతిగా నటించిన 'కోర్డ్' చిత్రం చిన్న సినిమాలలో బ్లాక్ బస్టర్ అనిపించుకుని భారీ లాభాల్ని తెచ్చి పెట్టడంతో శివాజీకి మంచి డిమాండ్ ఏర్పడింది. అలా అని ఏది పడితే అది చేయకుండా సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తూ వెళుతున్న ఆయన 'దండోరా'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ 'సమాన్లు' అంటూ మహిళలపై చేసిన కామెంట్‌లు వివాదాస్పదం కావడం, పెద్ద చర్చకు తెరలేపడం తెలిసిందే. అనసూయ నుంచి చన్మయి, నాగబాబు, వర్మ వరకు ఈ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. శివాజీని కార్నర్ చేస్తూ అతనిపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. వీరి కామెంట్‌ల కారణంగా శివాజీ వివాదం నెట్టింట వైరల్ కావడంతో తెలంగాణ మహిళా కమీషన్ రియాక్ట్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని సుమోటోగా తీసుకుని అతనికి పమన్లు పంపించి షాక్ ఇచ్చింది.
సమన్లకు స్పందించిన శివాజీ కమీషన్ ముందు హాజరై వివరణ ఇస్తూ తనపై కావాల్సిన వారే కుట్ర చేశారని సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. కట్టూ, బొట్టూ బాగుండాలని చెప్పడమే తప్పయిందని ఈ సందర్భంగా శివాజీ వాపోయాడు. ఇకపై తాను ఎవరిపై అలాంటి వ్యాఖ్యలు చేయనని వివరణ ఇచ్చాడు. అయితే ఈ వివాదంపై తాజాగా నటుడు నవదీప్ స్పందించాడు. 'దండోరా' సినిమా ప్రచారంలో భాగంగా చిత్రబృందం కాలేజీ స్టూడెంట్స్‌తో చిట్‌చాట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉన్న మీరు ఆయనని ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. దీనిపై నవదీప్ ఆసక్తికరంగా స్పందించాడు. 'ఎవరైనా మాట్లాడే సమయంలో మధ్‌యలో ఆపడం భావ్యం కాదని, శివాజీ తనకంటే సీనియర్ అని స్పష్టం చేశాడు. అంతే కాకుండా థర్టీ ఇయర్స్‌గా ఇండస్ట్రీలో ఉంటూ పబ్లిక్ ప్లాట్ ఫామ్ మీద మాట్లాడుతున్న మనిషి తనకు అనిపించింది తను చెబుతున్నప్పుడు అది తప్పో రైటో ముందు వాళ్లకు తెలియాలి. వినే మనకు తెలియాలి. తను మాట్లాడుతుంటే అది తప్పు అని చెప్పి ఆపడానికి నేనెవర్ని. సమయం సందర్భంను బట్టి ఎవరి ప్రాస్పెక్టీవ్‌లో వాళ్లు కరెక్ట్ ల్యాంగ్వేజ్‌లో మాట్లాడాలి అనేది ఒక ఐడియల్ సొసైటీ అలా ఉంటేనే బావుంటది. అలా ఎంత వరకు ఉందనేది మనకు తెలుసు.
పబ్లిక్‌లో ఒక మాట అనడం అనేది.. రెస్పాన్సిబులిటీ అనేది యాక్టర్స్ వరకు మాత్రమేనా?.. ఎక్కడో కూర్చుని సోషల్ మీడియాలో కామెంట్‌లు చేస్తుంటారు. అవన్నీ మేము పడుతున్నాం. యాక్టర్స్ అయినా, కామనర్స్ అయినా పబ్లిక్‌లో మనం కనిపించట్లేదని ఇష్టమొచ్చినట్టు మాట్లాడకూడదు. ఎవరైనా కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి. రెస్పాన్సిబులిటీ అనేది యాక్టర్స్ మాత్రమే కాకుండా అందరికీ ఉండాలి అని నేను నమ్ముతున్నాను. శివాజీ మాట్లాడుతున్నప్పడు కెమెరా వెనకాలున్నా కామన్ ఆడియన్స్ విజిల్స్ వేశారు. చప్పట్లు కొట్టారు.. మరి వాళ్లని ఏం చేయాలి?' అంటూ సెటైర్లు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.