యష్ 'టాక్సిక్'.. పేర్లతో ప్లాన్ తెలిసిందిగా!

కన్నడ స్టార్ హీరో యష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్ పై ఆడియన్స్ లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.;

Update: 2025-12-31 10:55 GMT

కన్నడ స్టార్ హీరో యష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్ పై ఆడియన్స్ లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేజీఎఫ్ సిరీస్‌ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న యష్, ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారనే తెలుస్తోంది.

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న టాక్సిక్ సినిమాలో పాత్రల క్యారెక్టరైజేషన్ ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. అయితే టాక్సిక్ మూవీలో ముగ్గురు స్టార్ బ్యూటీలు కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి హీరోయిన్లు గా నటిస్తుండగా.. రీసెంట్ గా మేకర్స్ వారి ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేశారు. అవి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకున్నాయి.

అంతే కాదు, వారి పాత్రల పేర్లు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. కియారా నదియా పాత్రలో కనిపించనుండగా.. హ్యుమా ఖురేషీ ఎలిజబెత్‌ పాత్రలో అలరించనున్నారు. నయనతార గంగగా సందడి చేయనున్నారు. అయితే ముగ్గురి రోల్స్ నేమ్స్.. వారి పాత్రలు మూడు వేర్వేరు కమ్యూనిటీలకు చెందినవని స్పష్టంగా సూచిస్తున్నాయని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు చెబుతున్నారు.

ఆ క్యారెక్టర్ల నేమ్స్ ను అలా సెలెక్ట్ చేయడమే కథలో కీలక మలుపుకు సంకేతమని అభిప్రాయపడుతున్నారు. నిజానికి.. గీతూ మోహన్ దాస్ గత చిత్రాలను గమనిస్తే, ఆమె కథల్లో పాత్రలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందనేది తెలుస్తుంది. సామాజిక అంశాలు, మానవ సంబంధాలను స్ట్రాంగ్ గా తెరపై చూపించడంలో గీతూకు ప్రత్యేక శైలి ఉంది.

అదే తరహాలో ఇప్పుడు టాక్సిక్ లో కూడా హీరోతో పాటు హీరోయిన్ల పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. కియారా పోషిస్తున్న నదియా పాత్ర ఒక ప్రత్యేక వర్గాన్ని సూచిస్తుందని, ఆమె పాత్ర ద్వారా కథలో ఎమోషన్స్, సన్నివేశాలు మరింత స్ట్రాంగ్ రివీల్ అవుతాయని టాక్. ఇక నయనతార గంగా పాత్ర సంప్రదాయం, శక్తి, భావోద్వేగాల మేళవింపుగా ఉంటుందని చెబుతున్నారు.

మరో హీరోయిన్ హ్యుమా ఖురేషి పోషిస్తున్న ఎలిజబెత్ పాత్ర అంతర్జాతీయ నేపథ్యం లేదా విదేశీ కమ్యూనిటీకి చెందినదిగా ఉండవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ మూడు పాత్రలు... మూడు భిన్న కమ్యూనిటీలు సూచిస్తూ టాక్సిక్ మూవీ కథను కొత్త దిశగా తీసుకెళ్లేలా ఉంటాయని ఇప్పుడు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంతే కాదు.. మూడు వేర్వేరు కమ్యూనిటీలకు చెందిన హీరోయిన్ల పాత్రలు, వారి ఆలోచనలు, జీవితాలు.. సినిమాలో యష్ పాత్రతో ఎలా ముడిపడతాయన్నదే టాక్సిక్ కథలో మెయిన్ పాయింట్ కావచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి టాక్సిక్ లో ముగ్గురు హీరోయిన్ల పాత్రలు కేవలం గ్లామర్‌ కే పరిమితం కాకుండా, కథను ఎలా ముందుకు నడిపిస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News