స్టార్ హీరో ఫ్లాట్ 96కోట్లు.. కుర్ర హీరోయిన్ ఫ్లాట్ 39 కోట్లు!

Update: 2021-01-28 02:30 GMT
ముంబై బాంద్రా.. జుహూ.. వెర్సోవా ఏరియాలు టూమ‌చ్ కాస్ట్ లీ అన్న సంగ‌తి తెలిసిందే. ఫేజ్ 3 ప్ర‌పంచం.. బాలీవుడ్ సెల‌బ్రిటీ ప్ర‌పంచం ఇక్క‌డే నివాసం ఉంటుంది. బ‌చ్చ‌న్ లు .. ఖాన్ లు.. క‌పూర్లు నివాసం ఉండే చోటు ఇది. ఇక్క‌డే రోష‌న్ ల‌కు భారీ బంగ్లాలు ఉన్నాయి.

అక్టోబర్ లో వెర్సోవాలో రూ .96 కోట్ల విలువైన సూపర్ లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశారు హృతిక్ రోషన్. ఇప్పుడు ఆయ‌న  అడుగుజాడల్లోనే జాన్వి క‌పూర్ ఏకంగా 39 కోట్లు పెట్టి అపార్ట్ మెంట్ కొనుక్కుంది. ప్ర‌స్తుతం ఈ ఫ్లాట్ కి ఇంటీరియ‌ర్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని స‌మాచారం.

దివంగత న‌టి శ్రీదేవి కుమార్తె గా జాన్వి కపూర్ న‌ట‌వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తోంది. మామ్ అడుగుజాడ‌ల్లో పెద్ద స్టార్ అవ్వాల‌ని క‌ల‌లుగంటోంది. అందుకు త‌గ్గ‌ట్టే కెరీర్ తో పాటు స్టాట‌స్ బిల్డ‌ప్ అవుతోంది. 2020 డిసెంబర్ ‌లో జుహులో ఒక అపార్ట్ ‌మెంట్ ను రూ.39 కోట్లకు కొనుగోలు చేసింది. తన తల్లి శ్రీదేవి తో క‌లిసి ఉన్న ఫోటోని షేర్ చేసిన‌‌ జాన్వి  ఇన్‌స్టాగ్రామ్ లో 2020 డిసెంబర్ 7 న ట్రిపులెక్స్ ఒప్పందాన్ని ఖరారు చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు.

ముంబై వెర్సోవాలోని `అరయ బిల్డింగ్`లో 14- 15 - 16 వ అంతస్తులలో ఈ ఫ్లాట్లు విస్తరించి ఉంది. జాన్వి కపూర్ ఫ్లాట్ కొన్న భవనం ముంబైలోని జుహు ప్రాంతంలో ఉంది.  ఫ్లాట్ కార్పెట్ ప్రాంతం 3456 స్క్వేర్ ఫీట్ ఉంది. డిసెంబర్ 10న రిజిస్ట్రేషన్ .. స్టాంపుల శాఖలో ఒప్పందం పూర్తి చేసుకున్న జాన్వీ.. అపార్టుమెంట్ల‌ రిజిస్ట్రేషన్ కోసం రూ .78 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించింది. జాన్వీ కపూర్ కు ఆ భవనంలో ఆరు కార్ల‌ను పార్కింగ్ చేసుకునేందుకు స్థ‌లం ఉంది.

ఇషాన్ ఖత్తర్ స‌ర‌స‌న‌ ధడక్ అనే చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వీ వ‌ర‌స‌గా అర‌డ‌జ‌ను చిత్రాల్లో న‌టించేస్తోంది. దోస్తానా సీక్వెల్ .. త‌క్త్ అనే హిస్టారిక‌ల్ మూవీలోనూ న‌టిస్తోంది. ఒక్కో సినిమాకి భారీగా పారితోషికం అందుకుంటూ అపార్ట్ మెంట్ల‌లో పెట్టుబడులు పెడుతోంది.
Tags:    

Similar News