భార్య పార్టీ .. స్టార్ హీరో గెంటేశాడా!?

Update: 2016-12-19 13:30 GMT
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరోల్లో ఆయన ఒకడు. సాధారణంగా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండడం ఈయనకు అలవాటు. రీసెంట్ గా ఆయన భార్య తన స్నేహితులను ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చింది. అందరు గెస్ట్ లు వచ్చేసి.. పార్టీ మంచి పీక్ స్టేజ్ లో ఉండగా.. హీరో గారి ఎంట్రీ ఇవ్వడంతో తేడా వచ్చేసింది.

సడెన్ గా ఇంటికొచ్చిన ఆయన ఏదో మూడ్ లో ఉండడం.. అదే సమయంలో భార్య-తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడంతో ఈయనకు చిర్రెత్తుకొచ్చేసిందట. వెంటనే అక్కడ ఉన్న వాళ్లందరినీ వెళ్లిపోమని చెప్పేశాడట ఆ హీరో. అది కూడా చాలా కఠినంగా చెప్పడం.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం.. కఠిన పదజాలంతో వచ్చిన వాళ్లను వెళ్లిపోమని ఆర్డర్ వేయడం జరిగిందట. దీంతో వాళ్లంతా నిమిషాల వ్యవధిలోనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

మరోసారి ఇలాంటివి రిపీట్ అయితే సహించబోనని తేల్చి చెప్పాడట ఆ హీరో. భర్త ప్రవర్తనకు బాగా అప్ సెట్ అయిందట స్టార్ వైఫ్. సాధారణంగా ఇలాంటి ప్రవర్తన ఆయన దగ్గర ఉండడట. కానీ.. తన మూడ్ సరిగా లేని టైంలో.. అందులోనూ లేట్ నైట్ లో అలాంటి పార్టీ చూసేసరికి కోపం వచ్చి మాట్లాడాడని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News