బీచ్ వెకేష‌న్‌లో తాప్సీ సంపుడే సంపుడు

అందాల‌ నటి తాప్సీ పన్ను ప్రస్తుతం సోషల్ మీడియాలో తన వెకేషన్ ఫోటోల‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ముఖ్యంగా విదేశీ బీచ్ వెకేష‌న్‌లో దుమ్ము రేపుతోంది.

Update: 2026-09-14 12:39 GMT

అందాల‌ నటి తాప్సీ పన్ను ప్రస్తుతం సోషల్ మీడియాలో తన వెకేషన్ ఫోటోల‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ముఖ్యంగా విదేశీ బీచ్ వెకేష‌న్‌లో దుమ్ము రేపుతోంది. ఇటీవల క్లబ్ మెడ్ సీషెల్స్ రిసార్ట్‌లో గడుపుతున్న కొన్ని గ్లామరస్ ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ``చివరి నిమిషంలో కుదిరినప్పటికీ కొన్ని విజయాలను సెల‌బ్రేట్ చేయ‌డం చాలా ముఖ్యం. పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడాలని ఎవరూ కోరుకోరు.. కానీ బహుశా అదే జీవితానికి ఒక మంచి అనుభూతిని ఇస్తుంది! అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ జోడించారు. అలాగే తన మనసును, శరీరాన్ని రీసెట్ చేసుకోవడానికి ఈ సాల్ట్ అండ్ వాటర్ క్లెన్జ్ చాలా అవసరమని తాప్సీ పేర్కొన్నారు.



 


తాప్సీ షేర్ చేసిన ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు రింగుల జుట్టు అందాన్ని, గ్రేస్‌ను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు తాప్సీ నటించిన సినిమాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఒక నెటిజన్ తాప్సీ నటనను కొనియాడుతూనే `గంధారి` సినిమాపై తన అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. ఏదేమైనా సెలవులను ఆస్వాదిస్తూ బీచ్‌లో దిగిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.



 


గాడ్ ఫాద‌ర్ లేకుండానే..

ఇక‌ తాప్సీ పన్ను కెరీర్ - వ్యక్తిగత ప్రవర్తనపై ఆన్‌లైన్ వేదికల్లో ఎప్పుడూ రకరకాల చర్చలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ నటి ఇండస్ట్రీలో ఎదగడానికి పడిన కష్టం.. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా సొంతంగా ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకున్న తీరును చాలా మంది ప్రశంసిస్తుంటారు. పింక్, తాపడ్, బద్లా వంటి విభిన్నమైన మహిళా ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ తాప్సీ చేసిన‌ ప్రయాణంపై నెటిజన్లలో మంచి అభిప్రాయం ఉంది.



 


అయితే సినిమాల పరంగా తాప్సీ ఎంత ప్రశంసలు అందుకుంటోందో.. స్క్రీన్ వెలుపల ఆమె ప్రవర్తన- పబ్లిక్ రిలేషన్స్ తీరుపై విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తుంటాయి. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలకు తాప్సీ ఇచ్చే ఘాటైన రిప్ల‌య్‌లు ఇంటర్వ్యూలలో మాట్లాడే తీరు చూసి కొందరు త‌న‌కు సూపీరియారిటీ కాంప్లెక్స్ ఉందని భావిస్తుంటారు. విమర్శలను సానుకూలంగా స్వీకరించలేకపోతున్నారనే వాదన కూడా నెటిజన్ల మధ్య తరచూ చర్చకు వస్తుంటుంది.



 


కొన్ని విమ‌ర్శ‌లు ఎప్ప‌టికీ..

ఇక నటన విషయానికి వస్తే.. తాప్సీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. చాలా సినిమాలలో త‌న‌ నటన ఒకేలా ఉంటుందని.. దాదాపు ప్రతీ చిత్రంలోనూ ఒకే రకమైన అర్బన్ లేదా ఢిల్లీ యాసను పునరావృతం చేస్తుంటుందని విమర్శకులు భావిస్తారు. అయితే కష్టపడి పైకి వచ్చిన ట్యాలెంటెడ్ న‌టిగా తాప్సీకి ఉన్న గుర్తింపు త‌ను ఎంచుకునే బలమైన కథాంశాలు నిరంత‌రం ట్రెండింగ్‌లో ఉంచుతున్నాయి.



 


Tags:    

Similar News