తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా.. మళ్ళీ ఇలా..
ఓం శాంతి శాంతి శాంతిః షూటింగ్ సమయంలోనే తరుణ్, ఈషా మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందనే వార్తలు వచ్చాయి. సినిమాలో ఇద్దరూ భార్యాభర్తల పాత్రల్లో నటించారు.
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా పేర్లు మరోసారి వైరల్ అవుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఇద్దరూ ఒకే ఇంట్లో పూజ చేసిన ఫోటోను తరుణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే ప్రచారం జరుగుతుండటంతో ఈ ఫోటోకు కూడా అదే కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఇద్దరూ ఇప్పటివరకు తమ రిలేషన్ గురించి డైరెక్ట్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఓం శాంతి శాంతి శాంతిః షూటింగ్ సమయంలోనే తరుణ్, ఈషా మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందనే వార్తలు వచ్చాయి. సినిమాలో ఇద్దరూ భార్యాభర్తల పాత్రల్లో నటించారు. ప్రమోషన్స్ సమయంలో కూడా కలిసి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అప్పటినుంచే బయట కూడా ఇద్దరూ కలిసి కనిపిస్తున్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో మొదలయ్యాయి.
ఆ టైమ్‌లో తరుణ్‌ను ఈషాతో రిలేషన్ గురించి నేరుగా అడిగారు కూడా. దానికి ఆయన పూర్తిగా ఖండించలేదు. ఈషా తనకు ఫ్రెండ్ కంటే ఎక్కువ అని చెప్పారు. అది తన వ్యక్తిగత విషయం కావడంతో సరైన సమయం వచ్చినప్పుడు చెబుతానని కూడా అన్నారు. తాను ఏదైనా చెప్పడం వల్ల ఇంకెవరైనా ఇబ్బంది పడటం ఇష్టం లేదని అప్పట్లో చెప్పారు. ఆ మాటల తర్వాతే వీరిద్దరి గురించి టాక్ ఇంకాస్త పెరిగింది.
ఈషా కూడా తరుణ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఓం శాంతి శాంతి శాంతిఃలో ఇద్దరూ కలిసి పనిచేయడం అదే మొదటిసారి. తరుణ్ నటన చూసి తాను ఆశ్చర్యపోయానని, ఇద్దరి మధ్య ఉన్న దగ్గరితనం తెరపై కూడా కనిపించిందని చెప్పారు. సినిమా జనవరిలో విడుదలైన తర్వాత కూడా వీరి పేర్లు మాత్రం అప్పుడప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఇప్పుడు వినాయక చవితి ఫోటో రావడంతో మళ్లీ అదే విషయం ట్రెండ్ అవుతోంది. నార్మల్ గా సినిమా ప్రమోషన్ కోసం కలిసి కనిపించడం వేరు. పండగ రోజు ఇంట్లో జరిగే పూజలో కలిసి కనిపించడం వేరనే కామెంట్స్ వస్తున్నాయి. అందుకే ఈసారి చాలామంది దీన్ని రిలేషన్‌పై ఇచ్చిన చిన్న హింట్‌లా చూస్తున్నారు. ఫోటోలోనూ ఇద్దరూ చాలా క్యాజువల్‌గా కనిపించడంతో మరింత ఫోకస్ పెరిగింది.
తరుణ్ ఇప్పటికే “ఫ్రెండ్ కంటే ఎక్కువ” అని చెప్పడంతో, ఇప్పుడు ఈ ఫోటోకు కొత్త అర్థాలు వెతకాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. కానీ పెళ్లి, రిలేషన్ గురించి ఇద్దరిలో ఎవరూ అధికారికంగా మాట్లాడలేదు. ప్రస్తుతం తరుణ్ దర్శకుడిగా తన సినిమాలతో బిజీగా ఉండగా, ఈషా కూడా తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరూ ఎప్పుడు ఆ బంధం గురించి డైరెక్ట్ గా మాట్లాడతారన్నది చూడాలి.