ట్రైలర్ టాక్: 'అనుమాన పక్షి'తో డీజే టిల్లు డైరెక్టర్ ఏం ప్లాన్ చేశాడు?
డీజే టిల్లుతో టాలీవుడ్‌లో సరికొత్త కామెడీ ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ విమల్ కృష్ణ, ఇప్పుడు రాగ్ మయూర్ లీడ్ రోల్‌లో 'అనుమాన పక్షి' అనే క్రేజీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
డీజే టిల్లుతో టాలీవుడ్‌లో సరికొత్త కామెడీ ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ విమల్ కృష్ణ, ఇప్పుడు రాగ్ మయూర్ లీడ్ రోల్‌లో 'అనుమాన పక్షి' అనే క్రేజీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నెల 18న విడుదలవుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రీసెంట్‌గా విడుదల చేశారు. ఒక వింత పక్షి వాయిస్‌తో మొదలైన ఈ ట్రైలర్, ప్రతి చిన్న విషయానికి విపరీతంగా సందేహాలు పెంచుకునే ఒక ఓవర్‌థింకర్ కథాంశంతో నడిచింది.
సన్నీకి లోకంలో కనిపించే ప్రతి మనిషి, ఎదురయ్యే ప్రతి పరిస్థితిపై అనుమానం ఉండటమే కథలోని మెయిన్ పాయింట్. ఇంట్లో పనిమనిషి తుడిచే తీరు మొదలుకొని నదిలో నీళ్లు తాగేంతవరకు, ప్రతి సందర్భంలోనూ వంద రకాల ప్రశ్నలు వేస్తూ తోటివారి లైఫ్‌ను కాంప్లికేట్ చేస్తుంటాడు. ఈ వింత మనస్తత్వం చుట్టూ అల్లిన డైలాగులు నేటి తరం ఆలోచనలకు దగ్గరగా అనిపించేలా ఉన్నాయి.
ఇక అసలు కథ సన్నీ కాశ్మీర్ ట్రిప్ వెళ్లినప్పుడు ఊహించని మలుపు తిరుగుతుంది. అక్కడ కన్యాకుమారి అనే అమ్మాయితో లవ్ ట్రాక్ మొదలవుతుంది. ప్రేమలో పడేటప్పుడే ఎగ్జిట్ ప్లాన్ సిద్ధం చేసుకునే అతని క్యారెక్టర్‌కు, ఎదురయ్యే రొమాంటిక్ సీన్లకు మధ్య వచ్చే సిట్యువేషన్లు ఎంటర్‌టైన్ చేసేలా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే కాశ్మీర్ లొకేషన్లు అందంగా హైలెట్ అయ్యాయి.
అయితే కథలో రొమాంటిక్ కామెడీనే కాకుండా మిస్టరీ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వైజాగ్ వాయిస్ అంటూ ఒక యూట్యూబర్ పోలీస్ ఆఫీసర్‌గా అజయ్ ఎంట్రీతో కామెడీగా ఉంది. కాశ్మీర్‌లోని ఆ ఇంట్లో ఏం జరుగుతోంది, తుపాకీలతో ఛేజింగ్‌లు ఎందుకు వస్తున్నాయి, రాశి వంటి కీలక పాత్రల నేపథ్యం ఏంటనే ట్విస్టులు ట్రైలర్‌లో చూపించారు.
నటీనటుల పరంగా రాగ్ మయూర్ తన బాడీ లాంగ్వేజ్, టైమింగ్‌తో సన్నీ పాత్రకు చక్కగా సెట్ అయ్యాడు. హీరోయిన్ మెరిన్ ఫిలిప్‌తో ఆయన కెమిస్ట్రీ డీసెంట్‌గా కనిపిస్తోంది. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ కన్ఫ్యూజన్ డ్రామాకు తగ్గట్టుగా సెట్ అయింది. చిలకా ప్రొడక్షన్స్ పెట్టిన నిర్మాణ విలువలు లొకేషన్లలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ట్రైలర్ చూస్తే కాన్సెప్ట్ పరంగా ఒక డిఫరెంట్ అటెంప్ట్ లాగా అనిపిస్తోంది. ఇక హీరో ఓవర్‌థింకింగ్ కామెడీ పూర్తి నిడివి సినిమాలో ప్రేక్షకులను ఎంతవరకు ఎంగేజ్ చేస్తుందనేది చూడాలి. రొటీన్ ఫార్ములాకు భిన్నంగా విమల్ కృష్ణ రాసుకున్న స్క్రీన్‌ప్లే వెండితెరపై బాగా పేలితే, ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకునే ఛాన్స్ ఉంది.