కూతుళ్ళతో హీరోకు కాస్త కష్టంగా..

Update: 2017-03-22 08:31 GMT
ఆయన ఒక తెలుగు స్టార్ హీరో. ఒకప్పుడు సూపర్ క్రేజ్ ఉండేది. ఇప్పుడు వయస్సు పైబడటంతో చాలావారకు సినిమాల విషయంలో స్లో అయిపోయాడు. అయితే ఆయన సంతానంలో ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ఎప్పుడూ ఎక్కడా పబ్లిక్ లో కనిపించని ఆ కూతుళ్ళు.. ఇప్పుడు తమ తండ్రిని తమ సినిమా కోరిక తీర్చమని చంపేస్తున్నారట. దానితో హీరోగారికి చాలా కష్టంగా ఉందని తెలుస్తోంది.

నిజానికి ఈ హీరోగారి కూతుళ్ళు చాలా అందగత్తెలనే చెప్పాలి. అయితే వారు కూడా తమ ఫ్యామిలీ అంతా సినిమాల్లో ఉంది కాబట్టి.. ఇక్కడే ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నారట. అందులో ఒకమ్మాయి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని అనుకుంటే.. మరో అమ్మాయి మాత్రం హీరోయిన్ అవుతానని అంటోందట. అదే అసలు సమస్యగా మారింది. బాలీవుడ్లో అనిల్ కపూర్ వంటి స్టార్ హీరో కూతురు సోనమ్ కపూర్ బికినీల్లో రెచ్చిపోయినా కూడా జనాలు యాక్సెప్ట్ చేశారు కాని.. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ కూతురు హీరోయిన్ అవుతానంటే మాత్రం ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. అటువంటి మైండ్ సెట్లను దాటుకొచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి హీరోయిన్ ఎలా అవుతుంది?

ఆల్రెడీ నిహారిక కొణిదెల.. లక్ష్మీ మంచు.. చేతన ఉత్తేజ్ వంటి భామలు.. అటు పూర్తిగా గ్లామరస్ హీరోయిన్లు కాలేక.. ఇటు కేవలం కంటెంట్ బేస్డ్ సినిమాలే చేయలేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News