'లక్కు'కోసం స్టార్ యాక్టర్ పేరులో మార్పు..!

Update: 2021-02-28 02:30 GMT
సినీ పరిశ్రమలో అందం అభినయంతో పాటు అదృష్టం కూడా ఖచ్చితంగా అవసరం అనేది నమ్ముతుంటారు సెలబ్రిటీలు. కొందరు మాత్రం తమ టాలెంట్ తో అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు. కానీ కొందరి పరిస్థితి అటు స్టార్ స్టేటస్ రాక ఇటు సినిమాలు సక్సెస్ లేక సతమతమవుతుంటారు. ఆ కోవలో హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలు కూడా ఉంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్. లెజెండరీ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనయుడు అయినప్పటికీ.. రెండు దశాబ్దాల కెరీర్ ఉన్నప్పటికీ వెనక్కి తిరిగి చూసుకుంటే అభిషేక్ కెరీర్లో ఏమి సాధించలేదని లోటు కనిపిస్తుందట. ఇన్నేళ్లు సినిమాలు చేస్తున్నా కూడా అభిషేక్ కెరీర్ ఎప్పుడు కూడా సాఫిగా సాగలేదు.

ఎప్పుడు చూసిన ప్లాప్స్ లేదా ఒడిదుడుకులు ఇలా ఏదోకటి ఫేస్ చేస్తూనే ఉన్నాడు. యాక్టింగ్ స్కిల్స్, బిగ్ బి తనయుడు అనే బ్రాండ్ ఉన్నప్పటికీ అభిషేక్ ఇప్పటివరకు స్టార్ యాక్టర్ గా టాప్ స్థాయికి చేరలేకపోయాడు. అయితే ప్రస్తుతం అభిషేక్ తన అదృష్టం పై ఫోకస్ పెట్టాడట. ఇండస్ట్రీలో ఖచ్చితంగా అదృష్టం అవసరం అని నమ్మి ఈ జూనియర్ బచ్చన్ తన పేరులో చిన్న మార్పు చేయాలనీ నిర్ణయించుకున్నాడని సమాచారం. అసలు విషయానికి వస్తే.. అభిషేక్ బచ్చన్ తన పేరు మధ్యలో 'ఏ' అనే అక్షరం చేర్చనున్నట్లు తెలుస్తుంది. ఫేమస్ న్యూమరాలజిస్ట్ సంజయ్ బి జుమాని చెప్పిన సలహా మేరకు అభిషేక్ తన పేరులో ఏ అక్షరం జత చేయనున్నాడు. ఇదిలా ఉండగా.. అభిషేక్ నటించిన తాజా చిత్రం దస్వి. ఈ సినిమా టైటిల్స్ లో కూడా అభిషేక్ ఏ బచ్చన్ అనే పేరు ప్రచురించారు మేకర్స్. అయితే ఇంకా అభిషేక్ తన కొత్తపేరుతో సోషల్ మీడియా ఖాతాలలో మాత్రం మార్పులు చేయలేదు.
Tags:    

Similar News