అగ్ర‌ నిర్మాత కం డిస్ట్రిబ్యూట‌ర్ స్టాఫ్ కి మహమ్మారి!

Update: 2020-06-26 16:00 GMT
టాలీవుడ్ లో ఒక‌టే క‌ల‌కలం. ప్రముఖ వెట‌ర‌న్ రొమాంటిక్ హీరో ఫ్యామిలీ ఫ్రెండుకి మహమ్మారి.. ఆ ఇంటి స్టార్ల‌కు ఏమైందో డౌట్.. టీవీ సీరియ‌ల్ న‌టుడికి మహమ్మారి.. ఏడుగురి స్టాఫ్ కి టెస్టులు.. అంటూ నిన్నా మొన్నా ఒక‌టే ప్ర‌చారం హోరెత్తింది. ఆ దెబ్బ‌కు ఫిలింన‌గ‌ర్ కృష్ణాన‌గ‌ర్ ఆఫీసుల్లో ఒక‌టే క‌ల‌క‌లం. అటూ ఇటూ తిరిగిన వాళ్ల‌లో.. సెట్స్ కెళ్లిన వారిలో ఒక‌టే టెన్ష‌న్ టెన్ష‌న్. గ‌త రెండ్రోజులుగా టాలీవుడ్ లో ఆవిరులే పుట్టుకొ‌చ్చాయి.

ఈలోగానే మ‌రో పాజిటివ్ కేసుకు సంబందించిన వార్త గుబులు రేకెత్తిస్తోంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కం పంపిణీదారుడి వద్ద ఉన్న సిబ్బంది ఘోరమైన మహమ్మారి వైరస్ భారిన ప‌డ్డార‌న్న‌ది తాజా లీక్. ఈ ఉదంతంతో షాక్ తిన్న స‌ద‌రు నిర్మాత కం పంపిణీదారుడు త‌న కార్యాలయాన్ని మూసివేశార‌ట‌. ఆయ‌నే ఆపీస్ మూసేయ‌డంతో ఆ ప‌రిస‌రాల్లోని మిగిలిన సినిమా ఆపీస్ ల‌ను మూసేశార‌ట‌. వైరస్ బారిన పడతామ‌నే భయంతో మూసివేశార‌ని తెలుస్తోంది.

ఈ షాకింగ్ సంఘటన మొత్తం సినీ పరిశ్రమను మరోసారి ఆలోచింప‌జేసేలా చేస్తోంది. షూటింగుల‌ను తిరిగి ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంబ‌రం ఎంతో కాలం నిల‌బ‌డ‌నే లేదు అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి ఇప్పుడు. అనుమ‌తులు రాగానే చాలా ఆఫీసులు తిరిగి తెరిచారు. కానీ ఏం లాభం? ఈలోగానే అన్నీ పాడు వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. అతి కొద్దిమంది మాత్ర‌మే డేరింగ్ గా షూటింగుల‌కు వెళుతున్నారు. మ‌రికొంద‌రు జూలై .. ఆగ‌స్టు అంటూ తాత్సారం చేస్తున్నా.. ఇప్పుడు ఇలాంటి వార్త‌ల‌తో డౌట్లు పుట్టుకొస్తున్నాయి. తాజా సందిగ్ధ‌త‌తో మునుముందు కూడా కొన్ని నెల‌ల‌పాటు సినిమా వ్యాపారం చుట్టూ అనిశ్చితి కొనసాగ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.
Tags:    

Similar News