• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజయ్ - రష్మిక.. సొంత...

విజయ్ - రష్మిక.. సొంత ఊరిలో సాంప్రదాయంగా మొదలైన కొత్త జీవితం..

| టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రేజీ రూమర్డ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By - Madhu Reddy
Update: 2026-03-02 07:51 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రేజీ రూమర్డ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గీతాగోవిందం సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మొదలైంది. అలా ఎనిమిదేళ్లపాటు రహస్యంగా ప్రేమను కొనసాగించిన ఈ జంట.. ఎట్టకేలకు 2026 ఫిబ్రవరి 26న రెండు సాంప్రదాయాల పద్ధతుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

ఇకపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం అనంతరం శాస్త్రోత్తంగా జరిగే పనులను విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు మొదలుపెట్టారు. ఈ మేరకు నాగర్ కర్నూలు జిల్లా తుమ్మన్ పేట గ్రామానికి చేరుకున్న నవ దంపతులు విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న నూతన ఫామ్ హౌస్ లో గృహప్రవేశం చేసి, ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించనున్నారు ఇప్పటికే తుమ్మన్ పేట లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌస్ ను అత్యంత సుందరంగా అలంకరించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులను గ్రామ ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న దంపతులు విజయ్ ఫామ్ హౌస్ లో సత్యనారాయణ వ్రతం పూర్తి చేసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నారు.

ఇదిలా ఉండగా మార్చి 4వ తేదీన హైదరాబాద్ లో ఈ జంట తమ వెడ్డింగ్ రిసెప్షన్ జరుపుకోనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు పలువురు సినీ సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు కూడా రాబోతున్నారు. ఇప్పటికే ఈ నూతన జంట కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భారత ప్రధాని నరేంద్ర మోదీలను స్వయంగా కలిసి తమ రిసెప్షన్ వేడుకకు ఆహ్వానించారు.

అటు వివాహానికి ముందే విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించగా.. వివాహం అనంతరం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి రష్మిక మందన్న తమ రిసెప్షన్ వేడుకకు ఆహ్వానించింది.

ఇదిలా ఉండగా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా అలాంటివారు రిసెప్షన్ కి రాకూడదు అంటూ ఒక నోట్ రిలీజ్ చేసింది ఈ జంట. ముఖ్యంగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండలకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రిసెప్షన్ జరిగే హోటల్ పరిసరాలలో కఠినమైన ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. అధికారిక ఆహ్వానం లేని వారు రిసెప్షన్ ప్రాంగణానికి కూడా రావద్దని పోలీసులు స్పష్టం చేయగా.. అటు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కూడా పోలీసులు ఆంక్షలను గౌరవిస్తూ.. ఆహ్వానం లేకుండా ఎవరు రిసెప్షన్ కి రావద్దు అంటూ కోరింది. ఈ మేరకు ఈ జంట అభిమానులకు ఒక వినయపూర్వకమైన విజ్ఞప్తి కూడా చేసింది. అభిమానుల భద్రత, క్షేమం కొరకే ఈ ప్రకటన జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ఏది ఏమైనా వివాహం తర్వాత ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.



విజయ్ దేవరకొండ స్వగ్రామంలో శుభారంభం ❤️🏡

నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేట గ్రామానికి చేరుకున్న నవదంపతులు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ✨
నూతన ఫామ్‌హౌస్‌లో గృహప్రవేశం చేసి, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నారు 🙏

స్వగ్రామంలో సంప్రదాయాలతో మొదలైన కొత్త జీవితం 💖… pic.twitter.com/JyDiZdzXgs

— Tupaki (@tupaki_official) March 2, 2026


Tags:    
  • vijaydeverakonda 
  • rashmikamandanna 
  • nagarKurnool 
  • nativevillagevisit 
  • satyanarayanavratham 

Similar News

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

Copyright @2026

Powered by Blink CMS