బుడ్డోడితో 'సూర్య'.. న్యూ టైటిల్ తో క్యూట్ స్టైల్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు.;
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు. మూవీ టైటిల్ తో పాటు సూర్య ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. టైటిల్ ను విశ్వనాథ్ అండ్ సన్స్ గా ఫిక్స్ చేసినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం సూర్య లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మొదటగా టైటిల్ విషయానికొస్తే.. చాలా క్లాసీగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా.. వెంకీ అట్లూరి ఇప్పటికే వైవిధ్యమైన కథలతో సినిమాలు తీసి సినీ ప్రియులను మెప్పించారు. సార్, లక్కీ భాస్కర్ వంటి అందరికీ కనెక్ట్ అయ్యే టైటిల్స్ ను పెట్టి అట్రాక్ట్ చేశారు. ఇప్పుడు సూర్యతో చేస్తున్న మూవీకి కూడా అలాంటి టైటిల్ నే సెలెక్ట్ చేయడం విశేషం. విశ్వనాథ్ అండ్ సన్స్ టైటిల్ చూస్తే.. కంప్లీట్ ఫ్యామిలీ మూవీ అని తెలుస్తోంది.
అదే సమయంలో పోస్టర్ లో సూర్య ఒక చిన్న పిల్లవాడిని పట్టుకుని కనిపించారు. ముందు బాబీ హోల్డర్ బ్యాగ్ లో క్యూట్ పిల్లాడు ఉన్నాడు. సూర్య లుక్ చాలా ఫ్రెష్ గా ఉందని చెప్పాలి. వింటేజ్ మ్యాజిక్ తో సూర్య మెప్పించనున్నారని తెలుస్తోంది. మేకర్స్ కూడా అదే చెప్పారు. హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామాతో వింటేజ్ సూర్యను తీసుకొస్తున్నామని తెలిపారు.
ఇక సినిమాను 2026లో బిగ్గెస్ట్ డ్రామాగా వర్ణిస్తూ.. జూలైలో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే మూవీలో సూర్య సరసన ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. సీనియర్ నటి రవీనా టాండన్ కీలక పాత్రలో యాక్ట్ చేస్తుండడం విశేషం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కాగా, సూర్య జీవీ ప్రకాష్ కాంబోలో వచ్చే పాటలపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
అదే సమయంలో సినిమాను ప్రముఖ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఇప్పుడు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రివీల్ చేయగా.. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారట. భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ.. వరల్డ్ వైడ్ గా పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారని సమాచారం.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్యువల్ ప్రాజెక్టుగా సినిమా రూపొందుతుండడం విశేషం. ఇప్పటికే మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలియడంతో అవి ఇంకా పెరిగాయి. మరి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఎలా ఉంటుందో.. ఎంతటి హిట్ అవుతుందో వేచి చూడాలి.