టామ్–జెండయా సీక్రెట్ వెడ్డింగ్.. నిజ‌మేనా?

హాలీవుడ్ స్టార్ కపుల్ టామ్ హాలండ్, జెండ‌యా ఇప్పటికే రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? ఇప్పుడు హాలీవుడ్ మీడియా మొత్తం ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది.;

Update: 2026-03-02 08:38 GMT

హాలీవుడ్ స్టార్ కపుల్ టామ్ హాలండ్, జెండ‌యా ఇప్పటికే రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? ఇప్పుడు హాలీవుడ్ మీడియా మొత్తం ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. కారణం, జెండయాతో ఎన్నో ఏళ్లుగా వ‌ర్క్ చేస్తున్న ప్రముఖ స్టైలిస్ట్ లా రోచ్ చేసిన తాజా వ్యాఖ్యలు. 2026 యాక్ట‌ర్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ వద్ద ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లా రోచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.




 


పెళ్లిని మీరు మిస్ అయ్యారంటున్న లా రోచ్

పెళ్లి ఆల్రెడీ అయిపోయింది. మీరు మిస్ అయ్యారంటూ చ‌మ‌త్క‌రించ‌గా, ఆ వ్యాఖ్య నిజ‌మేనా అని మళ్లీ అడగ్గా, నవ్వుతూ అవును, నిజ‌మేన‌ని చెప్పడం వార్తకు మరింత బలాన్ని చేకూర్చింది. దీంతో ఈ జంట ఇప్పటికే ప్రైవేట్‌గా పెళ్లి చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేసిందా అన్న ఊహాగానాలు మళ్లీ ముదిరాయి. అయితే ఈ విషయంపై హాలండ్, జెండయా ప్రతినిధులను సంప్రదించినప్పటికీ అధికారిక సమాధానం ఇంకా రాలేదు.




 


స్పైడ‌ర్ మ్యాన్ ఫ్రాంచైజ్ తో మొద‌లైన ల‌వ్ స్టోరీ

స్పైడ‌ర్ మ్యాన్ ఫ్రాంచైజ్ సినిమాలతో జెండయా, హాలండ్ (29) ల‌వ్ స్టోరీ మొద‌లైంది. 2021లో కారులో వారిద్ద‌రూ ఉన్న ఫోటోలు బయటకు రావడంతో వీరిద్దరూ తమ రిలేషన్‌ను ఇన్‌డైరెక్ట్ గా అంగీకరించారు. అప్పటి నుంచి వీరి బంధం మెల్లగా బలపడుతూ వచ్చింది. 2025లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ తర్వాత ఎంగేజ్‌మెంట్ రూమర్స్ జోరందుకున్నాయి. ఆ అవార్డ్స్ వేడుకలో జెండయా ఎడమచేతికి రింగ్ ధరించి కనిపించడం చర్చనీయాంశమైంది.




 


అదే వేడుకలో ఓ రిపోర్టర్ ఎంగేజ్‌మెంట్ గురించి ప్రశ్నించగా, జెండయా చిరునవ్వుతో భుజాలు పైకెత్తి స్పందించిందన్న సమాచారం అప్పట్లో వైరల్ అయింది. అంతేకాదు, ఆమె ధరించిన లూయిస్ విట్ట‌న్ డ్రెస్ క్రింద T అక్షరం టాటూ కనిపించిందన్న ఫ్యాన్స్ గమనిక కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఈ జంట తమ వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ చాలా ప్రైవేట్‌గా ఉంచుకుంది. పబ్లిక్ అపియరెన్సెస్‌లోనూ, సోషల్ మీడియాలోనూ పరిమితంగా మాత్రమే తమ బంధాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు లా రోచ్ వ్యాఖ్యలతో ఆ ప్రైవసీ చుట్టూ ఉన్న గోడలు కొంత కదిలినట్టే కనిపిస్తోంది.




 


ప్రస్తుతం జెండయా A24 నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ది డ్రామాలో నటిస్తుండ‌గా, మరోవైపు హాలండ్, క్రిస్టోఫ‌ర్ నోల‌న్ తో క‌లిసి ది ఒడిస్సీలో కనిపించనున్నారు. ఈ సినిమాలో జెండయా కూడా భాగమవుతుండటం విశేషం. మరి ఈ సీక్రెట్ వెడ్డింగ్ నిజమేనా? లేక సరదా వ్యాఖ్యేనా? అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News