ప్రియాంక చోప్రా, దీపిక బాటలో అలియా భట్.. సాధ్యమవుతుందా?

సాధారణంగా ప్రాంతీయంగా గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీలు దేశవ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2026-03-02 06:14 GMT

సాధారణంగా ప్రాంతీయంగా గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీలు దేశవ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు సౌత్ సెలబ్రిటీలు అటు బాలీవుడ్లో సత్తా చాటే ప్రయత్నం చేస్తుంటే.. బాలీవుడ్ నటీమణులు మాత్రం హాలీవుడ్లో సత్తా చాటాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి.. ఆ తర్వాత బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకొని.. ఇప్పుడు హాలీవుడ్లో స్టార్ సెలబ్రిటీగా చలామణి అవుతూ ఎంతోమందికి రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ప్రధమంగా ప్రియాంక చోప్రా పేరు వినిపిస్తుంది.

8 సంవత్సరాల క్రితం బాలీవుడ్ ని వదిలి హాలీవుడ్ కి వెళ్లిపోయిన ఈమె.. అక్కడ పలు రకాల చిత్రాలలో, వెబ్ సిరీస్లలో అవకాశాలు అందుకొని ఆకట్టుకుంది. ఇప్పుడు అక్కడ ఒక స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న ప్రియాంక చోప్రా గ్లోబల్ ఇమేజ్ దక్కించుకోవడం వెనుక ఉన్న కష్టం గురించి అందరికీ చెప్పి ఆశ్చర్యపరిచింది. అక్కడ అంతర్జాతీయ వేడుకలలో సందడి చేయడమే కాకుండా హాలీవుడ్ చిత్రాలలో, వెబ్ సిరీస్లలో నటిస్తూ ఒక్కో చిత్రానికి 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అలాంటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది..

ఇకపోతే ప్రియాంక తర్వాత దీపికా పదుకొనే కూడా హాలీవుడ్ లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే అటు అంతర్జాతీయ వేడుకలలో సందడి చేసిన ఈమె. ఆస్కార్ ఈవెంట్లో ఇండియా తరఫున మాట్లాడి మరింత ప్రాచుర్యం పొందింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి దారిలోనే ప్రముఖ బ్యూటీ అలియా భట్ కూడా హాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆమె ప్రయత్నం సఫలం కాలేదని చెప్పవచ్చు.

ముఖ్యంగా తన ఉనికిని బాలీవుడ్ దాటి గ్లోబల్ వైడ్ విస్తరించుకోవడానికి, అంతర్జాతీయ ప్రొఫైల్ నిర్మించుకోవడానికి విస్తృత కృషి చేస్తోంది.. అందులో భాగంగానే.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో.ప్రసారమవుతున్న ది హార్ట్ ఆఫ్ స్టోన్ లో గాల్ గాడోట్ తో కలసి కనిపించింది. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.. దీంతో ఈమెకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం కష్టంగా మారింది. దీనికి తోడు గ్లోబల్ స్థాయిలో బ్రాండ్ ప్రమోటర్ గా మారడమే కాకుండా.. రెడ్ కార్పెట్ పై నడిచి తన ఉనికిని పెంచుకుంటుంది కానీ ఎక్కడ ఆ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. దీనికి తోడు మెటాగాలా ఫ్యాషన్ వీక్ లో భాగంగా మెరిసిన ఈమె బాఫ్టా వేడుకల్లో కూడా ప్రెజెంటర్ గా కనిపించింది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఒక్కటి కూడా అంతర్జాతీయంగా గుర్తింపు అందించకపోవడం విచారకరం అనే చెప్పాలి.

వీటికి తోడు ప్రస్తుతం చెప్పుకోదగ్గ హాలీవుడ్ ప్రాజెక్టులు ఏవీ కూడా ఈమె చేతుల్లో లేకపోవడం గమనార్హం. ఏది ఏమైనా అలియా భట్ ప్రియాంక చోప్రా , దీపికా పదుకొనేల దారిలో హాలీవుడ్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటోంది. కానీ ఆ కలలు మాత్రం సాకారం అవ్వడానికి ఇంకా సమయం పట్టేలా ఉందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి తన కలలను సహకారం చేసుకుని గ్లోబల్ మార్కెట్లో ఎలా తన ఉనికిని చాటుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News