సినిమా ఇండస్ట్రీకి వర్మ హెచ్చరిక.. ఏఐ రాక.. కార్మికులకు అడ్డుగా మారనుందా?

రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ. " నా సినిమాలో ఇప్పటికే నేను ఏఐ ను విస్తృతంగా ఉపయోగిస్తున్నాను.;

Update: 2026-03-02 05:14 GMT

చిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాంగోపాల్ వర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ప్రతి విషయంలో కూడా స్పందించే ఆయన గత కొంతకాలంగా అటు రాజకీయ అంశాలతో పాటు ఇటు సినిమా అంశాలపై చర్చిస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసింది . ఇకపోతే ఇలాంటి సమయంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యాధునిక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI ) సినిమాపై చూపిస్తున్న ప్రభావం గురించి మాట్లాడి.. ఆందోళనలను మరింత పెంచేశారనే కామెంట్ వ్యక్తం అవుతున్నాయి.

ఆధునిక టెక్నాలజీ అయిన ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. హ్యూమన్ తో పని లేకుండా వేగంగా క్షణాల్లో సమాచారాన్ని అందిస్తూ.. అటు సమయాన్ని.. ఇటు డబ్బును ఆదా చేస్తూ వేగంగా అభివృద్ధి చెందుతోంది.. ఇప్పటికే పలు టెక్ కంపెనీలలో ఏఐ ని ఎక్కువగా ఉపయోగిస్తూ చాలామంది ఉద్యోగులను లే ఆఫ్ చేస్తున్న విషయం ఆందోళన కలిగిస్తోంది.. దీంతో ప్రజలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.. ముఖ్యంగా ఈ ఏఐ అనేది ప్రజలకు ఎంతవరకు అయితే మేలు చేస్తుందో.. అంతే ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తోందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏఐ రాక వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సరిగ్గా ఇలాంటి సమయంలో సినిమా పరిశ్రమ మీద ఆధారపడి బ్రతుకుతున్న వేలమంది కార్మికులకు ఏఐ పెను సంకటంగా మారిందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.. దీనికి తోడు రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్లు ఆందోళనలను మరింత పెరిగేలా చేస్తున్నాయని చెప్పవచ్చు. విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. భారతీయ సినిమా భవిష్యత్తు గురించి చేసిన హెచ్చరికలు అందరిలో ఆందోళనలు పెంచేశాయి. ఏఐ ను సునామీగా అభివర్ణించిన వర్మ.. ఇది చిత్ర పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తుందని.. సునామి వచ్చే ముందు నిశ్శబ్దం ఎలా ఉంటుందో అలా ఇప్పుడు ఏఐ మారనుంది అంటూ వర్మ చెప్పుకొచ్చారు..

రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ. " నా సినిమాలో ఇప్పటికే నేను ఏఐ ను విస్తృతంగా ఉపయోగిస్తున్నాను. కాలక్రమేనా ఈ ఏఐ అనేది మరింత శక్తివంతంగా మారనుంది అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా చాలామంది ఇప్పటికే ఏఐని వాడడం మొదలుపెట్టారు. తుఫాను వచ్చే ముందు ఎలా అయితే ప్రశాంతంగా ఉంటుందో.. ఏఐ అభివృద్ధి చెందే కొద్దీ భారతీయ సినిమా భవిష్యత్తు కూడా పూర్తిగా మారిపోతుం. ది ఒకరకంగా చెప్పాలి అంటే ఒకే ఒక ఏఐ ఉత్పత్తి చేసే చిత్రం వల్ల సినీ పరిశ్రమ కూలిపోవచ్చు" అంటూ వర్మ తన అభిప్రాయంగా చేసిన కామెంట్లు ఇప్పుడు అందరిలో అనుమానాలు, ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.

ఇకపోతే ఈ మధ్యకాలంలో ఏఐతో కొన్ని చిత్రాల టీజర్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అధిక నాణ్యత ఉన్న విజువల్స్, స్క్రీన్ ప్లే.. సహజత్వానికి మించి ఉండడంతో ప్రేక్షకులు కూడా ఈ ఏఐ ఉత్పత్తి చేసే కంటెంట్ ను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో గనుక ఏఐ ఉత్పత్తి చేసిన కంటెంట్ కి.. సినీ కార్మికులు కష్టపడి సంవత్సరాలు తరబడి చేసిన సహజ కంటెంట్ కి మధ్య వ్యత్యాసాన్ని గనుక గుర్తించలేకపోతే సినిమా పరిశ్రమ నిర్మాణం పూర్తిగా మారవచ్చు అని రాంగోపాల్ వర్మ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.

ఇప్పుడిప్పుడే భారతీయ సినిమా పరిశ్రమ ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తుంటే సడన్గా ఈ ఏఐ సినిమా నిర్మాణాన్ని మార్చి వేయడమే కాకుండా ఎంతో మంది కార్మికులను రోడ్డును వేయడానికి సిద్ధమవుతోందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం వర్మ చెప్పినట్టుగా ఏ ఐ పరిశ్రమ సినిమా ప్రపంచాన్ని ఏ విధంగా మారుస్తుందో.

Tags:    

Similar News