అల్లు వారి కొత్త కోడలి సిస్టర్స్.. ఈ మూమెంట్స్ చూశారా?

నిర్మాత అల్లు అరవింద్ చిన్నబ్బాయి, యంగ్ హీరో అల్లు శిరీష్ మరికొన్ని రోజుల్లో తన ప్రేయసి నయనికతో ఏడడుగులు వేయబోతున్నారు;

Update: 2026-03-02 04:41 GMT
అల్లు వారింట పెళ్లి వేడుకలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. నిర్మాత అల్లు అరవింద్ చిన్నబ్బాయి, యంగ్ హీరో అల్లు శిరీష్ మరికొన్ని రోజుల్లో తన ప్రేయసి నయనికతో ఏడడుగులు వేయబోతున్నారు. అయితే ఇప్పటికే కాబోయే జంట.. మ్యారేజ్ షూట్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందరినీ ఆకట్టుకుంటుండగా.. సినీ ప్రియులు, అల్లు ఫ్యాన్స్ అడ్వాన్స్డ్ గా మ్యారేజ్ విషెస్ చెబుతున్నారు.
అయితే ఆ ఫోటోల్లో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అది నయనిక షేర్ చేసిన స్పెషల్ పిక్. అందులో అల్లు వారింటికి కాబోయే కొత్త కోడలు.. తన ఇద్దరు సిస్టర్స్ తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ముగ్గురూ స్టైలిష్ గా కనిపిస్తుండగా.. ఫ్యాషన్ ఐకాన్స్ గా అట్రాక్ట్ చేస్తున్నారు. పిక్ అదిరిపోయిందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.
ఇక హైదరాబాద్ కు చెందిన బడా వ్యాపారవేత్త కుమార్తె నయనిక. ప్రస్తుతం ఆమె కూడా కొన్ని బిజినెస్ లు రన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2023 అక్టోబర్ లో మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం సందర్భంగా హీరో నితిన్ తోపాటు ఆయన భార్య నిర్వహించిన పార్టీలో షాలిని స్నేహితురాలైన నయానికను అల్లు శిరీష్ మొదటిసారి కలుసుకున్నారు.
మొదట స్నేహితులుగా మారిన వారిద్దరూ.. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లపాటు సీక్రెట్ గా ప్రేమాయణం సాగించారు. అనంతరం ఇరు కుటుంబాల అంగీకారంతో తాను నయనికను పెళ్లాడబోతున్నట్లు గత ఏడాది అల్లు శిరీష్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గతేడాది అక్టోబర్‌ లో అల్లు శిరీష్ - నయనిక రెడ్డి ఎంగేజ్మెంట్ హైదరాబాద్‌ లో గ్రాండ్ గా జరిగింది.
ఆ తర్వాత పెళ్లిని మార్చి 6వ తేదీన జరపనున్నట్లు కాబోయే దంపతులు కుటుంబాలు అఫీషియల్ గా అనౌన్స్ చేశాయి. అయితే మార్చి 6వ తేదీకి అల్లు ఫ్యామిలీలో స్పెషల్ ప్లేస్ ఉంది. ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డి దంపతుల పెళ్లి రోజు కూడా అదే రోజు కావడం విశేషం.స అందుకే తన అన్న,వదిన పెళ్లి రోజు తాను కూడా వివాహ బంధంలో అడుగుపెట్టాలని శిరీష్ నిర్ణయించుకోవడం విశేషం.
అయితే ఇప్పుడు మార్చి 6న జరగనున్న అల్లు శిరీష్, నయనిక వివాహం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పటికే అనేక మందికి ఆహ్వానాలు పంపారు. కొందరికి స్వయంగా వెళ్లి అందించారు. ఏదేమైనా అల్లు వారింట వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. 
Tags:    

Similar News